Share News

మిక్స్‌డ్‌ ఫైనల్లో సురేఖ ద్వయం

ABN , Publish Date - Apr 27 , 2024 | 05:11 AM

వరల్డ్‌కప్‌ స్టేజ్‌-1లో తెలుగు ఆర్చర్‌ జ్యోతి సురేఖ మూడో పతకం ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో సురేఖ-అభిషేక్‌ జోడీ 155-151తో బెకెర్రా-మెండెజ్‌ (మెక్సికో)పై నెగ్గి ఫైనల్‌ చేరింది.

మిక్స్‌డ్‌ ఫైనల్లో సురేఖ ద్వయం

షాంఘై: వరల్డ్‌కప్‌ స్టేజ్‌-1లో తెలుగు ఆర్చర్‌ జ్యోతి సురేఖ మూడో పతకం ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో సురేఖ-అభిషేక్‌ జోడీ 155-151తో బెకెర్రా-మెండెజ్‌ (మెక్సికో)పై నెగ్గి ఫైనల్‌ చేరింది. మహిళల వ్యక్తిగత రికర్వ్‌లో దీపిక కుమారి 3-1తో హున్‌యంగ్‌ (కొరియా)పై గెలిచి సెమీస్‌ చేరింది. మొత్తంగా భారత ఆర్చర్లు నాలుగు ఈవెంట్లలో ఫైనల్‌ చేరి పతకాలు ఖాయం చేశారు. ఇక, రికర్వ్‌ మిక్స్‌డ్‌ సెమీ్‌సలో తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్‌-అంకిత జోడీ 0-6తో లిమ్‌-కిమ్‌ వుజిన్‌ (కొరియా) ద్వయం చేతిలో ఓటమిపాలైంది.

Updated Date - Apr 27 , 2024 | 05:11 AM