ఐసీసీ టీ20 జట్టు కెప్టెన్ సూర్య
ABN , Publish Date - Jan 23 , 2024 | 06:15 AM
పొట్టి ఫార్మాట్‌లో గతేడాది ఉత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో కూడిన జట్టును ఐసీసీ ప్రకటించింది. దీనికి సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం విశేషం...
న్యూఢిల్లీ: పొట్టి ఫార్మాట్‌లో గతేడాది ఉత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో కూడిన జట్టును ఐసీసీ ప్రకటించింది. దీనికి సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం విశేషం. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో జరిగిన సిరీ్‌సల్లో సూర్య జట్టును విజయవంతంగా నడిపించాడు. అలాగే గతేడాది సూర్య ఆడిన 18 మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలతో 733 రన్స్ సాధించాడు. ఇక ఈ టీమ్‌లో భారత్ నుంచి జైస్వాల్, బిష్ణోయ్, అర్ష్‌దీ్‌పలకు కూడా చోటు దక్కింది.
జట్టు: సూర్యకుమార్ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ (భారత్), ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్), పూరన్ (వెస్టిండీస్), చాప్‌మన్ (న్యూజిలాండ్), సికిందర్ రజా, రిచర్డ్ ఎన్‌గరవ (జింబా బ్వే), మార్క్ ఐడెర్ (ఐర్లాండ్), రమ్‌జాని (ఉగాండా).