తన్మయ్ శతకం
ABN , Publish Date - Nov 14 , 2024 | 02:59 AM
తన్మయ్ అగర్వాల్ (240 బంతుల్లో 124 బ్యాటింగ్) శతకంతో ఆదుకోవడంతో ఆంధ్రతో బుధవారం మొదలైన రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ గౌరవప్రదమైన స్కోరు...
హైదరాబాద్ 244/5
ఆంధ్రతో రంజీ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తన్మయ్ అగర్వాల్ (240 బంతుల్లో 124 బ్యాటింగ్) శతకంతో ఆదుకోవడంతో ఆంధ్రతో బుధవారం మొదలైన రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ గౌరవప్రదమైన స్కోరు దిశగా సాగుతోంది. ఉప్పల్ స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ తొలిరోజు చివరికి 5 వికెట్లకు 244 పరుగులు చేసింది. అయితే ఆంధ్ర జట్టు పేలవ ఫీల్డింగ్ హైదరాబాద్ పాలిట వరమైంది. ఈ మ్యాచ్‌లో ఆంధ్ర 4 క్యాచ్‌లు జారవిడవగా అందులో రెండు తన్మయ్ అగర్వాల్‌వి కావడం విశేషం. ఆంధ్ర బౌలర్లలో స్పిన్నర్ విజయ్ 3 వికెట్లు తీయగా, లలిత్, సందీ్‌పకు చెరో వికెట్ లభించింది.
కెప్టెన్‌గా హనుమ విహారి
ఈ సీజన్‌లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడింట్లో ఓడి, ఒక్క మ్యాచ్‌ని డ్రా చేసుకొని ఒకే ఒక్క పాయింట్‌తో గ్రూపులో అట్టడుగున ఉన్న ఆంధ్ర జట్టు మరోసారి కెప్టెన్‌ను మార్చింది. 4 మ్యాచ్‌లకు ముగ్గురు కెప్టెన్లను ఏసీఏ మార్చడం చర్చనీయాంశమైంది. టీమిండియాకు ఆడిన విహారి, భరత్ అందుబాటులో ఉన్నా తొలుత రికీ భుయ్‌కు, తర్వాత షేక్ రషీద్‌కు సారథ్య బాధ్యతలివ్వగా, హైదరాబాద్‌తో రంజీకి తిరిగి విహారికి పగ్గాలు ఇచ్చారు.