అశ్విన్ స్థానంలో తనుష్
ABN , Publish Date - Dec 24 , 2024 | 06:05 AM
అశ్విన్ స్థానంలో ముంబై ఆఫ్ స్పిన్నర్ తనుష్ కోటియన్ భారత జట్టులో చేరనున్నాడు. తనుష్ ప్రస్తుతం..విజయ్ హజారే ట్రోఫీకోసం అహ్మదాబాద్‌లో ఉన్నాడు. మంగళవారం అతడు ముంబై నుంచి మెల్‌బోర్న్...
అశ్విన్ స్థానంలో ముంబై ఆఫ్ స్పిన్నర్ తనుష్ కోటియన్ భారత జట్టులో చేరనున్నాడు. తనుష్ ప్రస్తుతం..విజయ్ హజారే ట్రోఫీకోసం అహ్మదాబాద్‌లో ఉన్నాడు. మంగళవారం అతడు ముంబై నుంచి మెల్‌బోర్న్ బయల్దేరనున్నట్టు సమాచారం. వాస్తవంగా..కోటియన్‌కు బదులు లెఫ్టామ్ స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను ఆస్ట్రేలియా పంపాలనుకున్నారు. అయితే హజారే టోర్నీ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడించి అక్షర్‌ను ఆసీస్ పంపాలనుకున్నా.. కుటుంబ పనుల కారణంగా అతడు ఆ మ్యాచ్‌లకు దూరమ య్యాడు. దీంతో తనుష్‌కు చాన్స్ దక్కింది.
ఎవరితను..?
26 ఏళ్ల తనుష్ దేశవాళీ పోటీల్లో నికార్సయిన బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా పేరు పొందాడు. 2023-24 రంజీ సీజన్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచాడు. ముంబై జట్టు 42వ రంజీట్రోఫీ టైటిల్ గెలవడంలో కీలక భూమిక పోషించాడు. ఆ సీజన్‌లో 16.96 సగటుతో 29 వికెట్లు తీశాడు. 41.83 సగటుతో 502 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా 33 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 101 వికెట్లు పడగొట్టాడు. రెండు శతకాలతో మొత్తం 1525 పరుగులు సాధించాడు. మెల్‌బోర్న్ గ్రౌండ్‌లో తను్‌షకు మంచి రికార్డే ఉంది. ఇటీవలి పర్యటనలో భారత్ ‘ఎ’ తరపున ఎనిమిదో నెంబర్‌లో బరిలోకి దిగి 44 పరుగులు చేశాడు.