ఖలిస్థాన్ వాదులను అడ్డుకున్న ఫ్యాన్స్
ABN , Publish Date - Dec 27 , 2024 | 02:11 AM
బాక్సింగ్ డే టెస్ట్ సందర్భంగా మైదానంలోనే కాదు.. బయట కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. జాతీయ జెండాను అవమానిస్తున్న ఖలిస్థాన్ మద్దతుదార్లతో దేశ అభిమానులు...
బాక్సింగ్ డే టెస్ట్ సందర్భంగా మైదానంలోనే కాదు.. బయట కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. జాతీయ జెండాను అవమానిస్తున్న ఖలిస్థాన్ మద్దతుదార్లతో దేశ అభిమానులు ఘర్షణకు దిగారు. అయితే, పోలీసులు అడ్డుకొని ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపేశారు. స్టేడియం బయట కొందరు ఖలిస్థానీ జెండాలు పట్టుకొని భారత్‌ను కించపరిచే విధంగా మైక్‌లో మాట్లాడుతూ మీడియా దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు.