Share News

తొలి టెస్ట్‌ న్యూజిలాండ్‌దే

ABN , Publish Date - Feb 08 , 2024 | 06:00 AM

దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌ 281 పరుగుల భారీ తేడాతో గెలిచింది. రెండు టెస్ట్‌ల సిరీ్‌సలో 1-0 ఆధిక్యంలో నిలిచింది...

తొలి టెస్ట్‌ న్యూజిలాండ్‌దే

మౌంట్‌ మాంగనుయ్‌: దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌ 281 పరుగుల భారీ తేడాతో గెలిచింది. రెండు టెస్ట్‌ల సిరీ్‌సలో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్‌ స్కోరు 179/4 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను కివీస్‌ డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 349 పరుగులతో కలిపి మొత్తం 529 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. ఆటకు నాలుగో రోజు ఛేదనలో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు కుప్పకూలింది. డేవిడ్‌ బెడింగమ్‌ (87) పోరాటం వృథా అయింది. జేమిసన్‌ 4, శాంట్నర్‌ 3 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ 511, సౌతాఫ్రికా 162 పరుగులు చేశాయి. ఈ విజయంతో వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్‌ అగ్రస్థానానికి ఎగబాకగా.. భారత్‌ మూడో ర్యాంక్‌కు పడిపోయింది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది.

ఫైనల్లో సన్‌రైజర్స్‌

కేప్‌టౌన్‌: సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌ కేప్‌ వరుసగా రెండో ఏడాడి సౌతాఫ్రికా (ఎస్‌ఏ) టీ20 లీగ్‌ ఫైనల్‌కు చేరింది. క్వాలిఫయర్‌-1లో ఆ జట్టు 51 పరుగులతో డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ను చిత్తు చేసింది. తొలుత సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 157/8 స్కోరు చేసింది. మలాన్‌ (63) హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. ఛేదనలో బార్ట్‌మన్‌ (4/10), మార్కో జాన్సెన్‌ (4/16) దెబ్బకు జెయింట్స్‌ 19.3 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది.

Updated Date - Feb 08 , 2024 | 06:26 AM