అదరగొట్టిన అమ్మాయిలు
ABN , Publish Date - Oct 25 , 2024 | 02:05 AM
బౌలర్లు, ఫీల్డర్లు రాణించడంతో.. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీ్‌సలో భారత మహిళల జట్టు బోణీ చేసింది. తేజల్ హసాబ్నిస్ (42), దీప్తి శర్మ (41) బ్యాట్‌తో ఆదుకోగా...
పడగొట్టిన రాధ, సైమా
తొలి వన్డేలో భారత్ గెలుపు
59 పరుగులతో కివీస్ ఓటమి
అహ్మదాబాద్: బౌలర్లు, ఫీల్డర్లు రాణించడంతో.. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీ్‌సలో భారత మహిళల జట్టు బోణీ చేసింది. తేజల్ హసాబ్నిస్ (42), దీప్తి శర్మ (41) బ్యాట్‌తో ఆదుకోగా.. రాధా యాదవ్ (3/35), సైమా ఠాకూర్ (2/26) ప్రత్యర్థిని కట్టడి చేశారు. దీంతో గురువారం జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ 59 పరుగుల తేడాతో కివీ్‌సపై విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 44.3 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది. కెర్ సిస్టర్స్ అమేలియా 4 వికెట్లు, జెస్ 3 వికెట్లు పడగొట్టారు. తాత్కాలిక కెప్టెన్ స్మృతి మంధాన (5), షఫాలీ వర్మ (33), హేమలత (3), యాస్తిక (37) అవుట్ కావడంతో.. భారత్ 91/4తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో తొలి మ్యాచ్ ఆడుతున్న తేజల్, జెమీమా రోడ్రిగ్స్ (35) ఐదో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశారు.
అనంతరం ఛేదనలో న్యూజిలాండ్ 40.4 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. బ్రూక్ (39), మ్యాడీ గ్రీన్ (31) ఐదో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సైమా.. తాను వేసిన మూడో బంతికే సుజి బేట్స్ (1)ను క్యాచవుట్ చేసింది.
భారత్: 44.3 ఓవర్లలో 227 ఆలౌట్ (తేజల్ 42, దీప్తి 41; అమేలియా 4/42, జస్ 3/49).
కివీస్: 40.4 ఓవర్లలో 168 ఆలౌట్ (బ్రూక్ 39, గ్రీన్ 31; రాధ 3/35)