సింధు అలవోకగా..
ABN , Publish Date - Jul 29 , 2024 | 03:48 AM
హ్యాట్రిక్ పతక వేటలో ఉన్న ఏస్ షట్లర్ పీవీ సింధు.. ఒలింపిక్స్‌ను గ్రాండ్‌గా మొదలెట్టింది. మహిళల సింగిల్స్ గ్రూప్-ఎంలో జరిగిన తొలి మ్యాచ్‌లో 10వ సీడ్ సింధు 21-9, 21-6తో ఫాతిమా అబ్దుల్ రజాక్ (మాల్దీవులు)పై...
బ్యాడ్మింటన్
హ్యాట్రిక్ పతక వేటలో ఉన్న ఏస్ షట్లర్ పీవీ సింధు.. ఒలింపిక్స్‌ను గ్రాండ్‌గా మొదలెట్టింది. మహిళల సింగిల్స్ గ్రూప్-ఎంలో జరిగిన తొలి మ్యాచ్‌లో 10వ సీడ్ సింధు 21-9, 21-6తో ఫాతిమా అబ్దుల్ రజాక్ (మాల్దీవులు)పై సునాయాసంగా గెలిచింది. ప్రత్యర్థి నుంచి కనీస పోరాటం కూడా లేకపోవడంతో.. డబుల్ ఒలింపిక్ పతక విజేత సింధు కేవలం 29 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించింది. మెంటార్ ప్రకాశ్ పడుకోన్ సూచనలతో తన ఆట మెరుగుపడిందని మ్యాచ్ అనంతరం సింధు సంతోషం వ్యక్తం చేసింది. మానసికంగా బలంగా ఉండడానికి సానుకూల దృక్పథంతోపాటు యోగాను ప్రాక్టీస్ చేస్తున్నట్టు తెలిపింది. పురుషుల సింగిల్స్ గ్రూప్-కెలో 13వ సీడ్ హెచ్‌ఎ్‌స ప్రణయ్ శుభారంభం చేశాడు. తొలి మ్యాచ్‌లో ప్రణయ్ 21-18, 21-12తో ఫాబియాన్ రోత్ (జర్మనీ)పై నెగ్గాడు.