Share News

Yashasvi Jaiswal: టీమిండియా టాప్-10 బ్యాటర్లలో జైస్వాల్‌కు స్థానం.. నెంబర్ వన్ ఎవరో తెలిస్తే షాక్!

ABN , Publish Date - Feb 23 , 2024 | 08:06 PM

యశస్వి జైస్వాల్ తాజాగా ఓ గొప్ప గౌరవాన్ని అందుకున్నాడు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ పత్రిక ``ది టెలిగ్రాఫ్`` ప్రకటించిన భారత అత్యుత్తమ టాప్-10 బెస్ట్ బ్యాటర్ల జాబితాలో స్థానం సంపాదించాడు.

Yashasvi Jaiswal: టీమిండియా టాప్-10 బ్యాటర్లలో జైస్వాల్‌కు స్థానం.. నెంబర్ వన్ ఎవరో తెలిస్తే షాక్!

యువ సంచలనం యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) వరుస డబుల్ సెంచరీలతో క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకున్నాడు. కేవలం భారతీయులు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, మాజీ దిగ్గజాలు యశస్వి ఆటతీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ యువ క్రికెటర్ ఓ గొప్ప గౌరవాన్ని అందుకున్నాడు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ పత్రిక ``ది టెలిగ్రాఫ్`` (The Telegraph) ప్రకటించిన భారత అత్యుత్తమ టాప్-10 ఉత్తమ బ్యాటర్ల జాబితాలో స్థానం సంపాదించాడు.

ఓటింగ్ పద్ధతిలో అభిప్రాయాలను సేకరించి ``ది టెలిగ్రాఫ్`` ఈ జాబితాను వెలువరించింది. మొత్తం 1895 ఓట్లు సంపాదించిన యశస్వి ఈ జాబితాలో పదో స్థానంలో నిలిచాడు. కెరీర్ ఆరంభంలోనే యశస్వి దిగ్గజ ఆటగాళ్ల సరసన నిలవడం విశేషం. కాగా, ఈ జాబితాలో డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) అగ్రస్థానంలో నిలవడం విశేషం. క్రీడాభిమానులు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కంటే సెహ్వాగ్‌కు ఎక్కువ ఓట్లు వేసి అగ్ర స్థానంలో నిలబెట్టారు.

ఈ జాబితాలో వరుసగా వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, మొహ్మద్ అజారుద్దీన్, రోహిత్ శర్మ, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్, గుండప్ప విశ్వనాథ్, యశస్వి జైస్వాల్ నిలిచారు. అయితే రాహుల్ ద్రవిడ్ నిష్క్రమణ తర్వాత మూడో నెంబర్ స్థానాన్ని భర్తీ చేసి చాలా సంవత్సరాలు నిలకడగా ఆడిన పుజారాకు చోటు దక్కలేదు. రోహిత్ స్థానంలో పుజారాకు స్థానం దక్కాల్సిందని చాలా మంది అభిప్రాయపడ్డారు.

Updated Date - Feb 23 , 2024 | 08:06 PM