Share News

మూడోరోజూ టాస్‌ పడలేదు

ABN , Publish Date - Sep 12 , 2024 | 03:14 AM

అఫ్ఘానిస్థాన్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య టెస్టు మ్యాచ్‌ రద్దయ్యే అవకాశముందా? అంటే.. పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. మూడోరోజు కూడా ఆట మొదలవలేదు...

మూడోరోజూ టాస్‌ పడలేదు

అఫ్ఘాన్‌, కివీస్‌ టెస్టు మ్యాచ్‌ రద్దయ్యే చాన్స్‌

గ్రేటర్‌ నొయిడా: అఫ్ఘానిస్థాన్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య టెస్టు మ్యాచ్‌ రద్దయ్యే అవకాశముందా? అంటే.. పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. మూడోరోజు కూడా ఆట మొదలవలేదు. మంగళవారం రాత్రి వర్షం పడడంతో మూడో రోజైన బుధవారం కూడా కనీసం టాస్‌ పడకుండానే ఆట రద్దయింది. బుధవారం వర్షం లేకున్నా, మ్యాచ్‌కు వేదికైన గ్రేటర్‌ నొయిడా పిచ్‌ ఇంకా తడిగానే ఉంది. వాస్తవానికి షెడ్యూల్‌ ప్రకారం సోమవారమే మ్యాచ్‌ ప్రారంభమవ్వాలి. అయితే, వారం రోజుల క్రితం ఇక్కడ కురిసిన భారీ వర్షాల కారణంగా అవుట్‌ఫీల్డ్‌ మొత్తం చిత్తడిగా మారింది. నీరు బయటకు వెళ్లేందుకు ఈ మైదానంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే ఇందుకు కారణం.


దీంతో తొలి రెండు రోజులు కనీసం టాస్‌ కూడా వేయకుండానే ఆట రద్దయింది. వరుసగా మూడోరోజు కూడా అదే పరిస్థితి తలెత్తింది. మరో రెండురోజులు నొయిడాలో భారీ వర్షాలు పడే చాన్సుండడంతో టెస్టు మ్యాచ్‌ మొదలవడంపై సందేహాలు నెలకొన్నాయి. దాదాపు మ్యాచ్‌ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - Sep 12 , 2024 | 03:14 AM