మూడో టీ20 వర్షార్పణం
ABN , Publish Date - Sep 16 , 2024 | 05:04 AM
ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. మధ్యాహ్నం ఆట ప్రారంభానికి ముందే వర్షం మొదలైంది...
1-1తో సిరీస్ సమం
మాంచెస్టర్: ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. మధ్యాహ్నం ఆట ప్రారంభానికి ముందే వర్షం మొదలైంది. ఫలితంగా కనీసం టాస్ కూడా వీలు పడలేదు. దీంతో అంపైర్లు మ్యాచ్ రద్దుకే మొగ్గుచూపారు. ఈ మూడు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. దీంతో ఈ సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. ఇక, ఇరుజట్ల మధ్య ఈనెల 19 నుంచి ఐదు వన్డేల సిరీస్ మొదలవనుంది.