Share News

ఇటు 11.. అటు 61

ABN , Publish Date - Jul 26 , 2024 | 04:03 AM

వయసు సంఖ్య మాత్రమే. అది ప్రతిభకు ఏమాత్రం కొలమానం కాదు. కొంతమంది చిరుప్రాయంలోనే సత్తా చాటితే.. మరికొందరు లేటు వయసులో అద్భుతాలు సృష్టిస్తారు. అలా.. పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ తమదైన రీతిలో ముద్ర వేసేందుకు పిన్న, పెద్ద వయసు అథ్లెట్లు...

ఇటు 11..  అటు 61

వయసు సంఖ్య మాత్రమే. అది ప్రతిభకు ఏమాత్రం కొలమానం కాదు. కొంతమంది చిరుప్రాయంలోనే సత్తా చాటితే.. మరికొందరు లేటు వయసులో అద్భుతాలు సృష్టిస్తారు. అలా.. పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ తమదైన రీతిలో ముద్ర వేసేందుకు పిన్న, పెద్ద వయసు అథ్లెట్లు బరి లోకి దిగుతున్నారు. వీరిలో 11 నుంచి 60 ఏళ్ల పైబడిన వయసు క్రీడాకారులు ఉన్నారు. ఈసారి చైనాకు చెందిన 11 ఏళ్ల చిన్నారి జెంగ్‌ హావోహావో మహిళల స్కేట్‌బోర్డింగ్‌ ఈవెంట్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అతి పిన్నవయసు అథ్లెట్‌గా జెంగ్‌ రికార్డుకెక్కనుండగా.. ఈమె తర్వాతి స్థానంలో కెనడాకు చెందిన స్కేట్‌బోర్డింగ్‌ అథ్లెట్‌, 14 ఏళ్ల ఫే డి ఫాజియోతో పాటు భారత స్విమ్మర్‌ దినిధి డేషింగు (14 ఏళ్ల 2 నెలలు) ఉన్నారు. కెనడాకే చెందిన ఈక్వెస్ట్రియన్‌ జట్టు సభ్యురాలైన జిల్‌ ఇర్వింగ్‌ 61 ఏళ్ల వయసులో ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేస్తోంది.


పారిస్‌ క్రీడల బరిలో ఉన్న అతిపెద్ద వయసు అథ్లెట్‌ రికార్డు ఈమెదే. ఒక ఒలింపిక్స్‌ చరిత్రలోనే అతిపెద్ద వయసులో పోటీపడ్డ అథ్లెట్‌గా స్వీడన్‌ షూటర్‌ ఆస్కార్‌ స్వాహ్‌ ఘనత సాధించాడు. ఇతను 72 ఏళ్ల వయసులో 1920 ఆంట్వెర్ప్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు.

Updated Date - Jul 26 , 2024 | 04:04 AM