ఈసారి పతకాల సంఖ్య పెంచాలి
ABN , Publish Date - Aug 20 , 2024 | 03:14 AM
ఈనెల 28 నుంచి ఆరంభమయ్యే పారాలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లతో ప్రధాని మోదీ ముచ్చటించారు. వీడియో కాల్ ద్వారా జరిగిన ఈ సంభాషణలో క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా...
పారా అథ్లెట్లతో ప్రధాని మోదీ సంభాషణ
న్యూఢిల్లీ: ఈనెల 28 నుంచి ఆరంభమయ్యే పారాలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లతో ప్రధాని మోదీ ముచ్చటించారు. వీడియో కాల్ ద్వారా జరిగిన ఈ సంభాషణలో క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా పాల్గొన్నారు. 12 క్రీడాంశాల్లో గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి 84 మంది అథ్లెట్లు భారత్ తరఫున పాల్గొనబోతున్నారు. ‘క్రీడల్లో ప్రతిభ చూపడమే కాకుండా పారా అథ్లెట్లు తమ అంకిత భావం, మానసిక శక్తి, కఠోర శ్రమతో ఎలాంటి కష్టమొచ్చినా అధిగమించగలమని నిరూపించారు. 140 కోట్ల మంది భారతీయులు ఆశీస్సులు మీకున్నాయి. గతంలో టోక్యో క్రీడల్లో సాధించిన విజయాలకు మించి పారిస్‌లో పతకాలు కొల్లగొడుతారని ఆశిస్తున్నా’ అని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పారా అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలిపారు.