భారత్‌కు విరాట్ బై..బై..!
ABN , Publish Date - Dec 20 , 2024 | 06:02 AM
క్రికెట్ కెరీర్ చరమాంకంలో ఉన్న విరాట్ కోహ్లీ త్వరలో ఆటకు వీడ్కోలు పలకడం ఖాయం. అయితే విరాట్ భవిష్యత్‌లో భారత్‌లో నివసించబోవడం లేదట. తన భావి జీవితాన్ని లండన్‌లో...
లండన్‌లో స్థిరపడనున్న స్టార్ క్రికెటర్
కోహ్లీ కోచ్ వెల్లడి
న్యూఢిల్లీ: క్రికెట్ కెరీర్ చరమాంకంలో ఉన్న విరాట్ కోహ్లీ త్వరలో ఆటకు వీడ్కోలు పలకడం ఖాయం. అయితే విరాట్ భవిష్యత్‌లో భారత్‌లో నివసించబోవడం లేదట. తన భావి జీవితాన్ని లండన్‌లో గడపాలని కోహ్లీ నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని అతడి కోచ్ రాజీవ్ శర్మ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘విరాట్ తన పిల్లలు వామిక, అకాయ్, భార్య అనుష్క శర్మతో కలిసి లండన్ వెళ్లిపోవాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాడు. త్వరలో అతడు దేశం వీడి అక్కడ స్థిరపడనున్నాడు’ అని రాజీవ్ తెలిపాడు. విరాట్, అనుష్క కలిసి లండన్‌లో ఓ మేనేజ్‌మెంట్ సంస్థను నడుపుతున్నాడట.
ఆసీస్ మీడియాతో వాగ్వాదం..
ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్ట్‌లో తలపడేందుకు భారత జట్టు గురువారం మెల్‌బోర్న్ చేరుకుంది. భార్య, కూతురు, కుమారుడితో కలిసి విరాట్ విమానాశ్రయంనుంచి బయటకి రావడాన్ని గమనించిన కెమెరామన్లు తమ కెమెరాలను అతడివైపు తిప్పారు. దాంతో ఆగ్రహించిన విరాట్ వారి వద్దకు వచ్చిన చానెల్ 9 టీవీ మహిళా ప్రతినిధితో వాగ్వాదానికి దిగాడు. ‘నాకు, నా పిల్లలకు గోపత్య ఉండాలి. నా అనుమతి లేకుండా ఫొటోలు ఎలా తీస్తారు’ అని ఆమెను కోహ్లీ నిలదీశాడు. అయితే తాము అతడి కుటుంబాన్ని ఫొటో తీయలేదని కెమెరామన్లు చెప్పడంతో..శాంతించిన విరాట్ వారితో కరచాలనం చేసి వెళ్లిపోయాడు.