Share News

పూర్వవైభవం చాటాలని..

ABN , Publish Date - May 31 , 2024 | 05:59 AM

ఈసారి టీ20 ప్రపంచక్‌పలో అత్యంత పోటీ ఉన్న గ్రూప్‌-సిలో రెండుసార్లు చాంపియన్‌, టోర్నీకి ఆతిథ్యమిస్తున్న వెస్టిండీ్‌సతోపాటు పటిష్ట న్యూజిలాండ్‌, సంచలనాల అఫ్ఘానిస్థాన్‌ ఉండడంతో పోరు రసవత్తరంగా...

పూర్వవైభవం చాటాలని..

ఈసారి టీ20 ప్రపంచక్‌పలో అత్యంత పోటీ ఉన్న గ్రూప్‌-సిలో రెండుసార్లు చాంపియన్‌, టోర్నీకి ఆతిథ్యమిస్తున్న వెస్టిండీ్‌సతోపాటు పటిష్ట న్యూజిలాండ్‌, సంచలనాల అఫ్ఘానిస్థాన్‌ ఉండడంతో పోరు రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. వీటితోపాటు పపువా న్యూగిని (పీఎన్‌జీ), ఉగాండా లాంటి పసికూనలు అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకొంటున్నాయి. విండీస్‌, కివీస్‌ బలమైన జట్లే అయినా.. అఫ్ఘాన్‌ నుంచి ముప్పు పొంచి ఉండడంతో సూపర్‌-8కు చేరాలంటే ఆ జట్లు అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాల్సిందే.

కదనోత్సాహంతో కరీబియన్లు

గ్రూప్‌-సి విశ్లేషణ

వెస్టిండీస్‌

టీ20 స్పెషలిస్టులు పుష్కలంగా ఉన్న కరీబియన్‌ జట్టు.. సొంతగడ్డపై వరల్డ్‌కప్‌ నెగ్గాలని కలలు కంటోంది. 2022 టోర్నీలో పేలవ ప్రదర్శన చేసినా.. ఆ తర్వాత క్రమంగా పుంజుకొంది. గతేడాది చివర్లో ఇంగ్లండ్‌పై సిరీస్‌ నెగ్గిన విండీస్‌.. తమ జట్టులో మేటి ఆటగాళ్లు అందుబాటులో ఉంటే ఎంతటి ప్రమాదకారో తెలియజేసింది. రోవ్‌మన్‌ పావెల్‌ సారథ్యంలో ఈసారి గట్టిపోటీదారుగా బరిలోకి దిగనుంది. హెట్‌మయెర్‌, పూరన్‌, రస్సెల్‌, షెఫర్డ్‌ లాంటి బిగ్‌ హిట్టర్లు ఏదశలోనైనా మ్యాచ్‌ను మలుపు తిప్పగలిగే సత్తా ఉన్న వారు. ఆస్ట్రేలియాపై టెస్ట్‌ మ్యాచ్‌ నెగ్గడంలో కీలకపాత్ర పోషించిన పేసర్‌ షామర్‌ జోసె్‌ఫ తొలిసారి టీ20ల్లోకి అడుగుపెడుతున్నాడు. విండీస్‌ తమ ఆరంభ మ్యాచుల్లో ఉగాండా, పీఎ్‌సజీలతో ఆడనుండడంతో టోర్నీలో భారీ విజయాలు సాధించే అవకాశం ఉంది. మొత్తంగా తర్వాతి రౌండ్‌కు చేరగలమనే పూర్తి ఆత్మవిశ్వాసంతో కరీబియన్‌ జట్టు ఉంది.

న్యూజిలాండ్‌

నిలకడైన ప్రదర్శనతో సాగుతున్న జట్టు న్యూజిలాండ్‌. 2022లో ఆడిన వారిలో ఎక్కువ మందికి మళ్లీ జట్టులో చోటు కల్పించారు. మెగా ఈవెంట్‌ కోసం జట్టు పకడ్బందీగానే సన్నాహకాలు చేసింది. ఇటీవల పాక్‌తో టీ20 సిరీ్‌సకు ద్వితీయ శ్రేణి జట్టును పంపినా.. సిరీ్‌సను డ్రాగా ముగించారంటే బెంచ్‌ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వరల్డ్‌కప్‌ కోసం అనుభవజ్ఞులతోపాటు యువతకు జట్టులో స్థానం కల్పించారు. ఆరోసారి పొట్టికప్‌లో ఆడుతున్న కేన్‌ విలియమ్సన్‌ జట్టును నడిపించనుండగా.. రచిన్‌, అలెన్‌ కీలక ఆటగాళ్లు. ఐపీఎల్‌లో సత్తాచాటిన బౌల్ట్‌తోపాటు సౌథీ, హెన్రీ, ఫెర్గూసన్‌లతో బౌలింగ్‌ విభాగం బలంగా కనిపిస్తోంది. శాంట్నర్‌, సోధీ ప్రధాన స్పిన్నర్లు.

అఫ్ఘానిస్థాన్‌

అత్యంత వేగంగా ఎదుగుతూ ప్రత్యర్థి జట్లకు సవాల్‌గా మారిన అఫ్ఘానిస్థాన్‌.. ఇటీవలి కాలంలో సంచలనాలకు కేరా్‌ఫగా మారింది. నిరుడు వన్డే ప్రపంచక్‌పలో ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ లాంటి టాప్‌ జట్లకు షాకిచ్చింది. ఆసియా క్రీడల్లో ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. రషీద్‌ ఖాన్‌ గాయం నుంచి కోలుకొని జట్టులోకి పునరాగమనం చేయడమే గాకుండా అతనే జట్టుకు నాయకత్వం వహిస్తుండడంతో అఫ్ఘాన్‌ బలం మరింతగా పెరిగింది. గుర్బాజ్‌, ఒమర్జాయ్‌, ముజీబ్‌, నవీనుల్‌ జట్టులోని కీలక ఆటగాళ్లు.

ఉగాండా

ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో ఉగాండా అదరగొట్టింది. ఆఖరి మ్యాచ్‌లో రువాండాపై సునాయాసంగా నెగ్గి వరల్డ్‌క్‌పనకు అర్హత సాధించింది. గత 49 మ్యాచ్‌ల్లో ఉగాండా 41 నెగ్గింది. కెప్టెన్‌ బ్రియాన్‌ మసాబా సారథ్యంలో అనుభవజ్ఞులైన జట్టుతో బరిలోకి దిగనుంది. గతేడాది టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నామినీ అల్పేష్‌ రంజానీతోపాటు 43 ఏళ్ల ఫ్రాంక్‌ ఎన్‌సుబుగా జట్టులో ఉన్నారు. తొలి మూడు మ్యాచ్‌లను గయానాలోనే ఆడనుండడం ఆజట్టుకు కొంత లాభించే అవకాశం ఉంది.

పపువా న్యూగిని

రెండోసారి టీ20 వరల్డ్‌క్‌పలో ఆడుతోంది పపువా జట్టు. ఉగాండా తరహాలోనే గత 18 మ్యాచ్‌ల్లో 14 విజయాలతో టోర్నీలోకి అడుగుపెడుతోంది. అసద్‌ వాలా జట్టు కెప్టెన్‌. ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో రికార్డు స్థాయిలో వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచింది. ఆల్‌రౌండర్లు అధికంగా ఉన్న పీఎన్‌జీ.. గ్రూప్‌లోని పెద్ద జట్లకు సవాల్‌ విసిరే చాన్సుంది.

Updated Date - May 31 , 2024 | 05:59 AM