Unmukt Preet Singh : అన్‌మోల్ రికార్డు సెంచరీ
ABN , Publish Date - Dec 22 , 2024 | 06:44 AM
ఐపీఎల్‌లో అన్‌సోల్డ్‌గా మిగిలిన పంజాబ్ బ్యాటర్ అన్‌మోల్ ప్రీత్ సింగ్ (45 బంతుల్లో 12 ఫోర్లు, 9 సిక్స్‌లతో 115 నాటౌట్) లిస్ట్-ఎ క్రికెట్‌లో వేగవంత మైన
అహ్మదాబాద్: ఐపీఎల్‌లో అన్‌సోల్డ్‌గా మిగిలిన పంజాబ్ బ్యాటర్ అన్‌మోల్ ప్రీత్ సింగ్ (45 బంతుల్లో 12 ఫోర్లు, 9 సిక్స్‌లతో 115 నాటౌట్) లిస్ట్-ఎ క్రికెట్‌లో వేగవంత మైన శతకం బాదిన తొలి భారత బ్యాటర్‌గా, ఓవరాల్‌గా మూడో ఆటగా డిగా రికార్డు సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీ గ్రూప్-సిలో శనివారం అరుణాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్‌మోల్ 35 బంతుల్లోనే సెంచరీతో చెలరేగడంతో.. పంజాబ్ 9 వికెట్ల తేడాతో బోణీ చేసింది. కాగా, మాజీ ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ (40 బంతుల్లో 100) రికార్డును అన్‌మోల్ బద్దలుకొట్టాడు. 2009-10 సీజన్‌లో మహారాష్ట్రతో మ్యాచ్‌లో బరోడా తరఫున యూసుఫ్ ఈ ఫీట్ సాధించాడు. మొత్తంగా లిస్ట్-ఎ క్రికెట్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు జాక్ ఫ్రేజర్ (29 బంతుల్లో), దక్షిణాఫ్రికా దిగ్గజం డివిల్లీర్స్ (31 బంతుల్లో) టాప్-2లో ఉన్నారు. కాగా, అన్‌మోల్ విరుచుకుపడడంతో.. అరుణాచల్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 12.5 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది.