అనుపమ సంచలనం
ABN , Publish Date - Nov 20 , 2024 | 02:48 AM
భారత యువ షట్లర్ అనుపమ ఉపాధ్యాయ చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నమెంట్లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 15వ ర్యాంకర్, అమెరికా స్టార్ బీవెన్ జాంగ్‌కు షాకిచ్చి రెండో రౌండ్‌కు...
15వ ర్యాంకర్ జాంగ్‌కు షాక్
చైనా మాస్టర్స్‌లో సిక్కి జోడీ ముందంజ
షెన్జెన్: భారత యువ షట్లర్ అనుపమ ఉపాధ్యాయ చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నమెంట్లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 15వ ర్యాంకర్, అమెరికా స్టార్ బీవెన్ జాంగ్‌కు షాకిచ్చి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ 50వ ర్యాంకరైన అనుపమ 21-17, 8-21, 22-20తో జాంగ్‌ను కంగుతినిపించింది. 19 ఏళ్ల అనుపమ బీడబ్ల్యూఎఫ్ సూపర్ 750 ఈవెంట్లో మొదటి రౌండ్ దాటడం ఇదే తొలిసారి. రెండో రౌండ్లో నట్సుకి నిదైర (జపాన్)తో అనుపమ తలపడనుంది. ఇక, మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి/సుమిత్ రెడ్డి జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో సిక్కి జంట 23-21, 17-21, 21-17తో అమెరికా ద్వయం ప్రిస్లీ/జెన్నీని ఓడించింది.
మిగతా భారత షట్లర్లలో ప్రియాన్షు రజావత్, ఆకర్షి కశ్యప్ పోరాటం ఆరంభ రౌండ్‌కే పరిమితమైంది. పురుషుల సింగిల్స్‌లో రజావత్ 24-22, 13-21, 18-21తో చికో అరా ద్వి వార్దోయో (ఇండోనేసియా) చేతిలో, మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్ 10-21, 18-21తో టొమొకా (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యారు.