ఉష, మేరీ..మౌనమేల?
ABN , Publish Date - Feb 12 , 2024 | 02:22 AM
లైంగిక వేధింపుల విషయంలో దిగ్గజ అథ్లెట్లు పీటీ ఉష, మేరీ కోమ్ మహిళా రెజ్లర్ల ఆందోళనకు అండగా నిలవలేదని ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ విమర్శించింది...
తిరువనంతపురం: లైంగిక వేధింపుల విషయంలో దిగ్గజ అథ్లెట్లు పీటీ ఉష, మేరీ కోమ్ మహిళా రెజ్లర్ల ఆందోళనకు అండగా నిలవలేదని ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ విమర్శించింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎ్‌ఫఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ వినేష్ ఫొగట్, బజ్‌రంగ్ పూనియా, మాలిక్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం మేరీ నేతృత్వంలో విచారణ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ‘విచారణ సమయంలో రెజ్లర్ల బాధలను విన్న మేరీ.. మాకు తన మద్దతు ఉంటుందని తెలిపింది. ఐవోఏ అధ్యక్షురాలు ఉష కూడా బాధితుల పక్షానే నిలుస్తానని చెప్పింది. కానీ, ఆ ఇద్దరూ ఇప్పుడు నోరు మెదపడం లేద’ని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సాక్షి వాపోయింది.