Share News

Virat Kohli: విరాట్ కోహ్లీ నాపై ఉమ్మేశాడు.. బ్యాట్‌తో కొడతానన్నా.. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!

ABN , Publish Date - Jan 29 , 2024 | 08:40 PM

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి, తనకు మధ్య గతంలో జరిగిన ఓ సంచలన విషయాన్ని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ తాజాగా వెల్లడించాడు. ``బాంటర్ విత్ బాయ్స్`` అనే పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ కోహ్లీ గురించి ఎల్గర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Virat Kohli: విరాట్ కోహ్లీ నాపై ఉమ్మేశాడు.. బ్యాట్‌తో కొడతానన్నా.. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి (Virat Kohli), తనకు మధ్య గతంలో జరిగిన ఓ సంచలన విషయాన్ని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ (Dean Elgar) తాజాగా వెల్లడించాడు. ``బాంటర్ విత్ బాయ్స్`` అనే పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ కోహ్లీ గురించి ఎల్గర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను మొదటిసారి భారత పర్యటనకు వెళ్లినపుడు కోహ్లీ తనపై ఉమ్మి (Spat) వేశాడని, రెండేళ్ల తర్వాత ఆ ఘటనపై క్షమాపణలు చెప్పాడని ఎల్గర్ వెల్లడించాడు. ఎల్గర్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

``2015లో తొలిసారి నేను భారత పర్యటనకు వెళ్లా. బ్యాటింగ్‌ కోసం మైదానంలోకి దిగి పిచ్‌ను చూస్తే నాకు నవ్వు వచ్చింది. బంతి విపరీతంగా టర్న్ అవుతోంది. ఆ వికెట్‌పై ఆడడం నాకు చాలా కష్టంగా అనిపించింది. అప్పుడు టీమిండియాకు కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కోహ్లీని నేను అదే మొదటిసారి చూడడం. అశ్విన్, జడేజా నన్ను స్లెడ్జ్ చేయడం ప్రారంభించారు. కోహ్లీ నాపై ఉమ్మి వేశాడు. నాకు చాలా కోపం వచ్చింది. నేను ఓ బూతు పదం వాడి బ్యాట్‌తో కొడతానని కోహ్లీని హెచ్చరించా. ఆ తర్వాత ఆ బూతు పదం ఉపయోగించి కోహ్లీ నన్ను తిట్టడం మొదలుపెట్టాడు.

కోహ్లీ స్లెడ్జింగ్‌ను నేను పట్టించుకోలేదు. ఎందుకంటే మేం భారత్‌లో ఉన్నాం. మేం తగ్గి ఉండాల్సిందే. ఈ సంఘటన గురించి తెలుసుకున్న తర్వాత ఏబీ డివిల్లియర్స్ కోహ్లీని ప్రశ్నించాడు. రెండేళ్ల తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చింది. అప్పుడు కోహ్లీ నాకు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పాడు. సిరీస్ ముగిసిన తర్వాత కలిసి డ్రింక్ చేద్దామా? అని అడిగాడు. అందుకు నేను అంగీకరించాను. సిరీస్ పూర్తవగానే ఇద్దరం పార్టీ చేసుకున్నాం. వేకువజామున 3 గంటల వరకు తాగుతూనే ఉన్నామ``ని ఎల్గర్ వెల్లడించాడు. 2012లో దక్షిణాఫ్రికా టీమ్‌లో చోటు దక్కించుకున్న ఎల్గర్.. 2021లో ఆ జట్టు టెస్ట్ కెప్టెన్ అయ్యాడు. ఇటీవలె అంతర్జాతీ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Updated Date - Jan 29 , 2024 | 08:40 PM