Share News

Virender Sehwag: నేను గనుక టీమిండియా హెడ్ కోచ్ అయితే.. ఎందుకు వెనకడుగు వేస్తున్నాడో చెప్పిన సెహ్వాగ్..

ABN , Publish Date - Sep 04 , 2024 | 02:28 PM

టీమిండియా మాజీ క్రికెటర్ల అనిల్ కుంబ్లే, గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రవిడ్ వంటి వారు టీమిండియాకు హెడ్ కోచ్‌లుగా పని చేశారు. మరికొంత మంది కూడా టీమిండియా హెడ్ కోచ్ కావడానికి ప్రయత్నాలు చేశారు. అయితే డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ పేరు మాత్రం ఎప్పుడూ కోచ్ రేసులో వినిపించలేదు.

Virender Sehwag: నేను గనుక టీమిండియా హెడ్ కోచ్ అయితే.. ఎందుకు వెనకడుగు వేస్తున్నాడో చెప్పిన సెహ్వాగ్..
Virender Sehwag

టీమిండియా మాజీ క్రికెటర్ల అనిల్ కుంబ్లే, గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రవిడ్ వంటి వారు టీమిండియాకు హెడ్ కోచ్‌లుగా పని చేశారు. మరికొంత మంది కూడా టీమిండియా హెడ్ కోచ్ (TeamIndia Head Coach) కావడానికి ప్రయత్నాలు చేశారు. అయితే డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) పేరు మాత్రం ఎప్పుడూ కోచ్ రేసులో వినిపించలేదు. తాజాగా కోచింగ్ గురించి తన మనసులోని మాటను సెహ్వాగ్ బయటపెట్టాడు. తనకు కూడా కోచ్ కావాలని ఉందని, అయితే అది ఐపీఎల్ (IPL) వరకు మాత్రమే పరిమితం అని చెబుతూ, తాను టీమిండియాకు హెడ్ కోచ్ అయితే ఎలా ఉంటుందో వివరించాడు.


``ఐపీఎల్‌లో ఏదైనా ఫ్రాంఛైజీ నన్ను కోచ్‌గా నియమించుకోవాలనుకుంటే సీరియస్‌గా ఆలోచిస్తా. టీమిండియా హెడ్ కోచ్ అయితే.. గతంలో 15 ఏళ్ల పాటు ఎలా పని చేశానో మళ్లీ అదే రొటీన్‌ను ఫాలో కావాల్సి ఉంటుంది. ఏడాదిలో 8-9 నెలలు జట్టుతో పాటే ఉండాలి. ప్రస్తుతం నా పిల్లల వయసు 14, 16 సంవత్సరాలు. ఇప్పుడు వారికి నా అవసరం ఉంది. ఇద్దరూ ఢిల్లీ క్రికెట్ టీమ్‌ సభ్యులు. ఒకరు ఓపెనర్, మరొకరు ఆఫ్-స్పిన్నర్. వారికి నేను సహాయం చేయాలి. వారితో కొంత సమయం గడపాలి. టీమిండియా హెడ్ కోచ్ అయితే నాకు ఆ అవకాశం ఉండదు. అదే నాకు పెద్ద ఛాలెంజ్. అదే ఐపీఎల్ కోచ్ అయితే అంత టైమ్ అవసరం లేదు`` అంటూ సెహ్వాగ్ పేర్కొన్నాడు.


ఇక, టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్‌కు ఎదురయ్యే పెద్ద ఛాలెజ్‌లు ఏవీ ఉండవని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ``ప్రస్తుతం టీమిండియాలోని క్రికెటర్లందరికీ తమ పాత్రపై పూర్తి అవగాహన ఉంది. కోచ్‌గా గంభీర్‌కు సవాళ్లు తక్కువే. ప్లేయర్లకు ఛాలెంజెస్ ఎక్కువ. గంభీర్ వారికి సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. జట్టు గెలవడం కోసం గంభీర్ ఏం చేయడానికైనా వెనుకాడడు. కోచ్‌గా కూడా గంభీర్ ఐసీసీ టైటిళ్లు సాధించాలనే పట్టుదలతో ఉంటాడు`` అని సెహ్వాగ్ అన్నాడు.

ఇవి కూడా చదవండి..

Yuvraj Singh: మా నాన్నకు మానసిక సమస్యలున్నాయి.. వైరల్ అవుతున్న యువరాజ్ సింగ్ పాత వీడియో..


Harbhajan Singh: పదివేల పరుగులు నువ్వు చేయలేకపోతే సిగ్గుపడాలి.. కోహ్లీతో హర్భజన్ ఏమన్నాడంటే..


రైలు ప్రమాదంలో కాలు కోల్పోయినా..


త్వరలో రిటైర్మెంట్‌పై నిర్ణయం : సైనా నెహ్వాల్‌


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 04 , 2024 | 02:28 PM