చనిపోతుందేమోనని భయపడ్డాం..
ABN , Publish Date - Aug 17 , 2024 | 06:14 AM
ఒలింపిక్స్ 50 కిలోల ఫ్రీస్టయిల్ విభాగం ఫైనల్ బరిలో నిలిచేందుకు రెజ్లర్ వినేశ్ ఫొగట్ కష్టపడిన తీరును కోచ్ వోలర్ ఎకోస్ వివరించాడు. ఓ దశలో ఆమె చనిపోతుందేమోనని భయపడినట్టు ఆందోళన వ్యక్తం చేశాడు. ఫైనల్‌కు ముందు నిర్ణీత
వినేశ్ కోచ్ వోలర్
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ 50 కిలోల ఫ్రీస్టయిల్ విభాగం ఫైనల్ బరిలో నిలిచేందుకు రెజ్లర్ వినేశ్ ఫొగట్ కష్టపడిన తీరును కోచ్ వోలర్ ఎకోస్ వివరించాడు. ఓ దశలో ఆమె చనిపోతుందేమోనని భయపడినట్టు ఆందోళన వ్యక్తం చేశాడు. ఫైనల్‌కు ముందు నిర్ణీత బరువుకన్నా 100 గ్రాములు అధికంగా ఉండడంతో వినేశ్‌పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ‘సెమీస్ తర్వాత వినేశ్ 2.7 కేజీల అధిక బరువుంది. వెంటనే గంటా 20 నిమిషాలు వ్యాయామం చేయించాం. అయినా 1.5 కేజీ అలాగే ఉంది. ఆ తర్వాత 50 నిమిషాల ఆవిరి సెషన్ తర్వాత ఒక చుక్క చెమట కూడా కనిపించలేదు. దీంతో అర్ధరాత్రి నుంచి ఉదయం 5.30 వరకు రకరకాల వ్యాయామాలను చేయించాం. మధ్యలో రెండు మూడు నిమిషాలపాటు విశ్రాంతి మాత్రమే ఉండేది. ఓ దశలో తను కుప్పకూలిపోయేది. తిరిగి లేపి గంటపాటు ఆవిరి సెషన్ కోసం పంపేవాళ్లం. ఈ క్రమంలో ఆమె చనిపోతుందేమో అనిపించేది’ అని గురువారం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన కోచ్ వోలర్ ఆ తర్వాత దాన్ని తొలగించాడు.