Shoaib Malik: మేం చాలా మంచి వాళ్లం.. టీమిండియాకు చక్కని ఆతిథ్యం అందిస్తాం: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్
ABN , Publish Date - Jul 27 , 2024 | 12:01 PM
చాలా ఏళ్ల తర్వాత పాకిస్థాన్ ఒక ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తోంది. వచ్చే ఏడాది 2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్‌లో జరగబోతోంది. అయితే భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్‌లో పర్యటించేందుకు భారత జట్టుకు అనుమతి లభించడం కష్టం.
చాలా ఏళ్ల తర్వాత పాకిస్తాన్ (Pakistan) ఒక ఐసీసీ (ICC) ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తోంది. వచ్చే ఏడాది 2025 ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) పాకిస్తాన్‌లో జరగబోతోంది. అయితే భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్‌లో పర్యటించేందుకు భారత జట్టుకు అనుమతి లభించడం కష్టం. ఈ నేపథ్యంలో టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని బీసీసీఐ (BCCI) పట్టుబడుతోంది. అందుకు పాకిస్తాన్ అంగీకరించడం లేదు. టీమిండియా పాక్ పర్యటనకు రావాలని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ మాజీ ఆటగాళ్లు పలు కామెంట్లు చేస్తున్నారు.
రాజకీయాలను పక్కనపెట్టి టీమిండియా పాకిస్తాన్ రావాలని కోరుకుంటున్నారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) కూడా తాజాగా టీమిండియాకు విజ్ఞప్తి చేశాడు. ``రెండు దేశాల మధ్య ఉన్న విభేదాలను వేరే రకంగా పరిష్కరించుకోవాలి. క్రీడల్లోకి రాజకీయాలు రాకూడదు. గతేడాది వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ జట్టు భారత్‌కు వెళ్లింది. ఇప్పుడు భారత జట్టు రావాలి. పాకిస్తాన్ గడ్డపై ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఆటగాళ్లు టీమిండియాలో చాలా మంది ఉన్నారు. ఈ పర్యటన వారికి మంచి అవకాశంగా ఉంటుందని భావిస్తున్నాను`` అంటూ మాలిక్ వ్యాఖ్యానించాడు.
అలాగే తాము చాలా మంచి వ్యక్తులమని, అతిథులకు ఎలా ఆతిథ్యం ఇవ్వాలో బాగా తెలుసని, భారత జట్టు కచ్చితంగా పాకిస్థాన్‌కు వస్తుందని నమ్ముతున్నానని మాలిక్ వ్యాఖ్యానించాడు. టీమిండియా పాకిస్తాన్‌కు వస్తే ఆ జట్టు ఆడే మ్యాచ్‌లన్నింటిని లాహోర్‌లోనే నిర్వహిస్తామని ఐసీసీకి పాకిస్తాన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి, బీసీసీఐ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
Jasprit Bumrah: ధోనీ, రోహిత్, కోహ్లీ కాదు.. టీమిండియా బెస్ట్ కెప్టెన్ ఎవరో చెప్పిన బుమ్రా!
Cricket: ఆటగాడిగా విఫలం.. కోచ్‌గా రాణిస్తారా.. శ్రీలంకపై గంభీర్ ప్రతీకారం తీర్చుకుంటారా..!
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..