Share News

T20 World Cup 2024: గతంలో ఐర్లాండ్‌తో టీ-20 మ్యాచ్ ఆడినపుడు ఏం జరిగింది? రింకూ ఎలా ఆడాడు?

ABN , Publish Date - Jun 05 , 2024 | 01:22 PM

భారత క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. టీమిండియా ఆటకు వేళైంది. టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌ ``ఎ`` లో భాగంగా బుధవారం తమ తొలి మ్యాచ్‌ను న్యూయార్క్‌లో ఐర్లాండ్‌తో ఆడనుంది.

T20 World Cup 2024: గతంలో ఐర్లాండ్‌తో టీ-20 మ్యాచ్ ఆడినపుడు ఏం జరిగింది? రింకూ ఎలా ఆడాడు?
Rinku singh

భారత క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. టీమిండియా ఆటకు వేళైంది. టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup) గ్రూప్‌ ``ఎ`` లో భాగంగా బుధవారం తమ తొలి మ్యాచ్‌ను న్యూయార్క్‌లో ఐర్లాండ్‌తో ఆడనుంది (India vs Ireland). ఈ టోర్నీ టైటిల్ ఫేవరెట్లలో ఒక జట్టుగా ఉన్న టీమిండియా పసికూనగా భావిస్తున్న ఐర్లాండ్‌తో తలపడుతోంది. అయితే టీ20 మ్యాచ్‌లో పసికూన, అగ్రజట్టు అనే తేడా పెద్దగా ఉండదు. అన్ని విభాగాల్లోనూ సక్రమంగా రాణించిన జట్టే విజేతగా నిలుస్తుంది.


తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ అద్భుత ప్రదర్శనతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా అప్రమత్తగా ఉండాల్సిందే. కాగా, చివరిసారి ఐర్లాండ్‌తో టీమిండియా టీ20 మ్యాచ్ ఆడినపుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 2023 ఆగస్ట్‌లో ఐర్లాండ్‌తో టీమిండియా 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడింది. ఆ సిరీస్‌ను టీమిండియా 2-0తో దక్కించకుంది. మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అంతకుముందు మ్యాచ్‌లో టీమిండియాను రింకూ సింగ్ (Rinku Singh) గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 185 పరుగులు చేసింది.


రుతురాజ్ గైక్వాడ్ (58), సంజూ శాంసన్ (40) మంచి ఆరంభం అందించినా తర్వాత బ్యాటర్లు విఫలమయ్యారు. స్కోరు 150కే పరిమితమవుతుందనుకునే దశలో రింకూ సింగ్ (21 బంతుల్లో 38) బౌండరీలతో విరుచుకుపడి జట్టు స్కోరును 185కు చేర్చాడు. ఛేజింగ్‌లో ఐర్లాండ్ బ్యాటర్ బాల్బిరిన్ (72) భారత బౌలర్లు సమయోచితంగా రాణించడంతో టీమిండియా 33 పరుగులతో గెలిచింది. కాగా, ఇప్పటివరకు ఐర్లాండ్‌తో జరిగిన 8 టీ20 మ్యాచ్‌ల్లో టీమిండియా ఏడింటిలో గెలిచింది. ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడిపోయింది.

ఇవి కూడా చదవండి..

T20 World Cup Ireland vs India : వేటకు వేళాయె!


అప్పటిదాకా.. బజ్‌రంగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 05 , 2024 | 01:22 PM