Share News

విరాట్‌, రోహిత్‌ ఎందుకు ఆడరు?

ABN , Publish Date - Aug 20 , 2024 | 03:11 AM

వచ్చే నెల 5 నుంచి జరిగే దులీప్‌ ట్రోఫీలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ ఆడకపోవడాన్ని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ ప్రశ్నించాడు. ఇందులో పాల్గొనే నాలుగు జట్లలో చాలామంది అంతర్జాతీయ ఆటగాళ్లు...

విరాట్‌, రోహిత్‌ ఎందుకు ఆడరు?

దులీప్‌ ట్రోఫీకి దూరమవడంపై గవాస్కర్‌ ప్రశ్న

న్యూఢిల్లీ: వచ్చే నెల 5 నుంచి జరిగే దులీప్‌ ట్రోఫీలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ ఆడకపోవడాన్ని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ ప్రశ్నించాడు. ఇందులో పాల్గొనే నాలుగు జట్లలో చాలామంది అంతర్జాతీయ ఆటగాళ్లు ఆడబోతున్నారు. అయితే రోహిత్‌, విరాట్‌, పేసర్‌ బుమ్రాలకు మాత్రం బీసీసీఐ మినహాయింపునిచ్చింది. జూన్‌ 28న టీ20 వరల్డ్‌కప్‌ ముగిశాక రోహిత్‌, విరాట్‌ ఈనెల 7 వరకు జరిగిన శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ మాత్రమే ఆడారు. ఇక సెప్టెంబరులో బంగ్లాదేశ్‌తో సిరీస్‌ వరకు వారికి ఎలాంటి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ ఉండదు. ‘దులీప్‌ ట్రోఫీకి సెలెక్టర్లు రోహిత్‌, విరాట్‌లను ఎంపిక చేయకుండా విశ్రాంతినిచ్చారు. దీంతో ఎలాంటి ప్రాక్టీస్‌ లేకుండానే వారు బంగ్లాతో సిరీస్‌ ఆడబోతున్నారు.


బుమ్రాపై పని ఒత్తిడిని అర్థం చేసుకోవచ్చు. కానీ బ్యాటర్లు కాస్త సమయం క్రీజులో గడపాల్సి ఉంటుంది. 30+ వయస్సు వచ్చిన ప్లేయర్లు నిరంతరం ఆడితేనే అత్యున్నత ప్రమాణాలను కాపాడుకున్నట్టవుతుంది. కానీ విరామం ఎక్కువైతే కండరాల శక్తి తగ్గి తిరిగి లయ అందుకునేందుకు సమయం పడుతుంది’ అని గవాస్కర్‌ సూచించాడు.

Updated Date - Aug 20 , 2024 | 03:11 AM