Share News

8వ నెంబర్‌లో ఎందుకు?

ABN , Publish Date - Nov 03 , 2024 | 01:36 AM

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ను ఎనిమిదో నెంబర్‌లో బరిలోకి దించడం చర్చనీయాంశమైంది. అద్భుత ఫామ్‌లో ఉన్న అతడిపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌...

8వ నెంబర్‌లో ఎందుకు?

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ను ఎనిమిదో నెంబర్‌లో బరిలోకి దించడం చర్చనీయాంశమైంది. అద్భుత ఫామ్‌లో ఉన్న అతడిపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సరైన నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యాత మంజ్రేకర్‌ తప్పుపట్టాడు. ‘కెరీర్‌ తొలి మూడు టెస్టుల్లోనూ అర్ధసెంచరీలు సాధించడంతో పాటు బెంగళూరు టెస్టులో 150 రన్స్‌ సాధించాడు. స్పిన్‌నూ మెరుగ్గా ఆడగలడు. కేవలం కుడి-ఎడమ కాంబినేషన్‌ కోసం సర్ఫరాజ్‌ను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కిందించడంలో అర్థముందా?’ అని ఎక్స్‌లో ప్రశ్నించాడు. ఈస్థానంలో సర్ఫరాజ్‌ నాలుగు బంతులు ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. వాంఖడేలో ఆడిన చివరి ఆరు దేశవాళీ ఇన్నింగ్స్‌లో ఈ ముంబైకర్‌ ఓ ట్రిపుల్‌ శతకం సహా 601 రన్స్‌ చేయడం విశేషం.

Updated Date - Nov 03 , 2024 | 01:36 AM