Share News

విరాట్‌కు విషెస్‌చెబుతావా?

ABN , Publish Date - Nov 06 , 2024 | 01:07 AM

భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఓ ఇటలీ మహిళా ఫుట్‌బాలర్‌ నెట్టింట ట్రోలింగ్‌కు గురైంది. మంగళవారం విరాట్‌ 36వ జన్మదినం సందర్భంగా ‘ఇటలీలోని ఓ అభిమాని...

విరాట్‌కు విషెస్‌చెబుతావా?

ఇటలీ మహిళా ఫుట్‌బాలర్‌పై ట్రోలింగ్‌

న్యూఢిల్లీ: భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఓ ఇటలీ మహిళా ఫుట్‌బాలర్‌ నెట్టింట ట్రోలింగ్‌కు గురైంది. మంగళవారం విరాట్‌ 36వ జన్మదినం సందర్భంగా ‘ఇటలీలోని ఓ అభిమాని తరఫున విరాట్‌ కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆల్‌ ద బెస్ట్‌’ అంటూ ఎగటా ఇసబెల్లా సెంటాస్సో అనే ఫుట్‌బాలర్‌ ఎక్స్‌లో పేర్కొంది. దీంతో భారత్‌ నుంచే ఆమెకు విమర్శలు ఎదురయ్యాయి. ‘నీకు క్రికెట్‌ గురించి, కోహ్లీ గురించి ఏమీ తెలీదు. అత్యధిక జనాభా కలిగిన భారత్‌ నుంచి ఎక్కువ లైక్స్‌ రావాలనే ఈ ప్రయత్నం’ అంటూ ఒకరు.. ‘రోహిత్‌ శర్మ ఫ్యాన్స్‌ నుంచి నీకిదే చివరి హెచ్చరిక.


వెంటనే పోస్ట్‌ను తొలగించు’ అని మరొకరు ఆమెను లక్ష్యంగా చేసుకున్నారు. అయితే వీటికి ఇసబెల్లా ఘాటుగానే స్పందిస్తూ.. ‘విరాట్‌ లేదా క్రికెట్‌ గురించి నేనెప్పుడు మాట్లాడినా నాపై విమర్శలకు దిగుతుంటారెందుకో. నామీద ఇంత తక్కువ అభిప్రాయం ఉంటే నన్ను ఫాలో అవకండి’ అని తెలిపింది.

Updated Date - Nov 06 , 2024 | 01:07 AM