సూర్య ఇచ్చిన చాన్స్తోనే..
ABN , Publish Date - Nov 15 , 2024 | 02:53 AM
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో తిలక్ వర్మ వన్డౌన్లో బరిలోకి దిగి శతకంతో అదరగొట్టాడు. అయితే ఈస్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ ఆడుతుంటాడు. కానీ ఆ మ్యాచ్లో మాత్రం తిలక్...
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో తిలక్ వర్మ వన్డౌన్లో బరిలోకి దిగి శతకంతో అదరగొట్టాడు. అయితే ఈస్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ ఆడుతుంటాడు. కానీ ఆ మ్యాచ్లో మాత్రం తిలక్ రావడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇందుకు కారణం.. సూర్యనే అతడి బ్యాటింగ్ ఆర్డర్ మార్చాడట. ‘మ్యాచ్ ముందు రోజు రాత్రి కెప్టెన్ సూర్య నా గదికి వచ్చి నీవు మూడో నెంబర్లో ఆడబోతున్నావని చెప్పాడు. ఇది చక్కటి అవకాశం.. సద్వినియోగం చేసుకోమని సలహా ఇచ్చాడు. మైదానంలో నా సత్తా ఏమిటో చూపిస్తానని అప్పుడే అతడితో అన్నాను. అలాగే నిరూపించుకోవడం సంతోషంగా ఉంది’ అని మ్యాచ్ ముగిశాక తిలక్ తెలిపాడు. అయితే కెప్టెన్ సూర్య మాత్రం.. గెబెహాలో తిలక్ తన గదికి వచ్చి వన్డౌన్లో చాన్స్ ఇవ్వమని అడిగినట్టు చెప్పడం గమనార్హం.