Share News

ఏ అవకాశమూ వదలకుండా..

ABN , Publish Date - Nov 19 , 2024 | 06:40 AM

న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్ట్‌ సిరీ్‌సలో ఘోరంగా ఓడడంతో..భారత జట్టు ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి. ఇప్పుడిక టీమిండియా

ఏ అవకాశమూ  వదలకుండా..

పెర్త్‌ టెస్ట్‌కు టీమిండియా

సన్నాహకాలు ముమ్మరం

మరో మూడు రోజుల్లో మొదలయ్యే ప్రతిష్ఠాత్మక బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ సిరీ్‌సకు టీమిండియా సన్నద్ధమవుతోంది. ఐదు టెస్ట్‌ల్లో భాగంగా తొలి మ్యాచ్‌ ఈనెల 22 నుంచి పెర్త్‌లో జరగనుంది. ఈ క్రమంలో మొదటి టెస్ట్‌ సన్నాహకాల్లో భాగంగా అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ పూర్తిగా సద్వినియోగం చేసుకొనేందుకు యత్నిస్తోంది. అందుకోసం ‘ఎ’ జట్టుతో మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను కూడా రద్దు చేసుకొని తీవ్ర సాధనలో మునిగింది.

పెర్త్‌: న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్ట్‌ సిరీ్‌సలో ఘోరంగా ఓడడంతో..భారత జట్టు ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి. ఇప్పుడిక టీమిండియా ఫైనల్‌ అవకాశాలు బోర్డర్‌-గవాస్కర్‌ టెస్ట్‌ సిరీ్‌సపై ఆధారపడ్డాయి. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీ్‌సలో నాలుగు టెస్ట్‌ల్లో విజయం సాధిస్తేనే రోహిత్‌ సేన డబ్ల్యూటీసీ తుది పోరుకు చేరగలుగుతుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌ టీమిండియాకు చావోరేవోనే. ఫలితంగా..పెర్త్‌లో జరిగే మొదటి టెస్ట్‌ను భారత జట్టు అత్యంత కీలకంగా తీసుకుంది. పెర్త్‌ పరిస్థితులకు పూర్తిగా అలవాటుపడేందుకు జట్టు సభ్యులంతా తీవ్రంగా శ్రమిస్తున్నారు. రెండుగా విడిపోయి మ్యాచ్‌లు ఆడారు. మొదటి మ్యాచ్‌కంటే రెండో మ్యాచ్‌లో బ్యాటర్లు చక్కగా రాణించారని సహాయ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ తెలిపాడు. ‘ఈ మూడు రోజుల్లో ఏం చేయాలనే విషయమై ఆస్ట్రేలియా రావడానికి ముందే గంభీర్‌, రోహిత్‌తో కలిసి మేం చర్చించాం. ఇక్కడి పరిస్థితులకు అలవాటుపడేలా జట్టు సభ్యుల మధ్య జరిగే మ్యాచ్‌ల్లో యువ, అనుభవజ్ఞులైన క్రికెటర్లకు తగు సమయం ఇవ్వాలని నిర్ణయించాం’ అని నాయర్‌తోపాటు బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ చెప్పాడు. ‘తొలి పోటీలో సాధారణ మ్యాచ్‌ మాదిరే బ్యాటర్‌ అవుటైతే క్రీజు వీడాల్సిందే. వారికి రెండో అవకాశం ఇచ్చాం. రెండోసారి కుర్రాళ్లు పరిస్థితులకు బాగా అలవాటై ఎక్కువసేపు క్రీజులో ఉన్నారు’ అని నాయర్‌ వివరించాడు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లో బౌలర్ల ప్రదర్శన గురించి చెబుతూ ‘రెండో రోజు..బౌలర్లతో దశలవారీగా బౌలింగ్‌ చేయించాం. వారి పని భారాన్ని పరిశీలించాం. ఒక్కో బౌలర్‌ 15 ఓవర్లు వేశాడు. బుమ్రా అయితే 18 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. అసలైన టెస్ట్‌ మ్యాచ్‌ పరిస్థితుల్లోకి బౌలర్లను తీసుకు రావడమే లక్ష్యంగా ప్రాక్టీస్‌ సాగింది. 22నాటికి పూర్తిగా గాడిలో పడతాం.’ అని నాయర్‌ వెల్లడించాడు. మరో మూడు సాధన సెషన్లున్నాయని తెలిపాడు.

సిరాజ్‌పై గురుతర బాధ్యత..

రోహిత్‌ శర్మ అందుబాటులో ఉండకపోవడంతో మొదటి టెస్ట్‌కు బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. దాంతో అతడు సారథ్య బాధ్యతలతోపాటు పేస్‌ బౌలింగ్‌ భారాన్ని కూడా మోయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో హైదరాబాదీ మహ్మద్‌ సిరాజ్‌ కీలకం కానున్నాడు. తన బౌలింగ్‌తో బుమ్రాకు అతడు అండగా నిలవాల్సి ఉంటుంది.. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరిగిన మూడు టెస్ట్‌ల్లో సిరాజ్‌ 29.53 సగటుతో 13 వికెట్లు పడగొట్టాడు. ఆ సిరీ్‌సలో అతడు అత్యధిక వికెట్ల తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఇందులో ఒక ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉండడం విశేషం. ‘సిరాజ్‌ సూపర్‌ బౌలర్‌’ అని మోర్నీ మోర్కెల్‌ ప్రశంసించాడు.

Updated Date - Nov 19 , 2024 | 06:40 AM