Viral: కోటీశ్వరుడిగా మారడంపై ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్ స్పందన ఏంటంటే..
ABN , Publish Date - Dec 15 , 2024 | 08:20 PM
చదరంగంలో ప్రపంచవిజేతగా నిలిచిన గుకేశ్ కోటీశ్వరుడిగా కూడా మారాడు. చైనాకు చెందిన డింగ్ లిరెన్‌పై గెలిచి రూ.11.45 కోట్ల ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతడు తనకు మల్టీ మిలియనీర్ ట్యాగ్ దక్కడంపై స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: చదరంగంలో ప్రపంచవిజేతగా నిలిచిన గుకేశ్ కోటీశ్వరుడిగా కూడా మారాడు. చైనాకు చెందిన డింగ్ లిరెన్‌పై గెలిచి రూ.11.45 కోట్ల ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతడు తనకు మల్టీ మిలియనీర్ ట్యాగ్ దక్కడంపై స్పందించాడు. అయితే, డబ్బు కోసం తానెప్పుడూ చెస్ ఆడలేదని అన్నాడు. చెస్ ఆడితే కలిగే అమితమైన ఆనందం కోసమే ఈ క్రీడలో పాల్గొంటానని చెప్పుకొచ్చాడు (Sports).
Viral: గ్రీన్ కార్డుపై ఎన్నారై సీఈఓ కీలక ప్రశ్న! ఒక్క పదంతో మస్క్ రిప్లై!
‘నా చెస్ కెరీర్ కోసం కుటుంబం ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. నా తల్లిదండ్రులు అనేక త్యాగాలు చేశారు. ఎన్నో ఆర్థిక కష్టాలను భరించారు. ఈరోజు మా పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ఇక భవిష్యత్తు గురించి నా తల్లిదండ్రులకు ఎటువంటి బెంగ లేకపోవడం నాకు ఏంతో సంతోషాన్ని ఇస్తోంది’’ అని వివరించాడు. గుకేశ్ తండ్రి ఈఎన్‌టీ సర్జన్ అయినప్పటికీ కుమారుడి పురోగతి కోసం తన కెరీర్‌ను త్యాగం చేయాల్సి వచ్చింది. ఇక మైక్రోబయాలజిస్టు అయిన గుకేశ్ తల్లి పద్మకుమారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచారు.
Viral: సోషల్ మీడియాలో జనాల సానుభూతితో డబ్బులు దండుకున్న వ్యక్తి జైలుపాలు
చెస్ అంటే తనకు అమితమైన ఇష్టమైని గుకేశ్ తెలిపాడు. ‘‘ప్రపంచఛాంపియన్‌గా మారినా మనసులో మాత్రం ఇప్పటికీ చిన్నవాడినే. చిన్నతనంలో బహుమతిగా లభించిన తొలి చెస్ బోర్డు నాకు అంతులేని ఆనందాన్ని ఇచ్చింది. నాకు అన్నీ తల్లిదండ్రులే. చెస్ ఛాంపియన్‌గా ఉండటం ఎంత గొప్పదో ఓ మంచి మనిషిగా ఉండటం అంతకంటే మిన్న’’ అని తెలిపాడు.
చెస్ అంటే అత్యంత అందమైన ప్రయాణమని యువ కెరటం అభివర్ణించాడు. ‘‘చెస్ ఆడిన ప్రతిసారీ ఏదో కొత్త విషయం నేర్చుకుంటాను. ఈ ప్రయాణమే నేను అచ్చెరువొందేలా చేస్తుంది. ఆటలో ఓడిపోతే బాధగా అనిపిస్తుంది. గెలిస్తే మనసంతా ఆనందంతో నిండిపోతుంది. గమ్యంతో పాటు ప్రయాణం కూడా ముఖ్యమే’’ అని చెప్పుకొచ్చాడు. డింగ్ లిరెన్‌తో క్రీడ అత్యద్భుతమైనది కాకపోయినప్పటికీ తనలో ఓటమి భయం కంటే గెలవాలన్న కాంక్షే బలంగా ఉందని వ్యాఖ్యానించాడు. రెండో గేమ్‌లో ప్రత్యర్థి ఆటను డ్రాగా ముగించడంపై కూడా కొంత ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అతడు అతి జాగ్రత్తగా ఆడాడని అన్నాడు. ‘‘అతడు కాస్త దూకుడుగా ఆడి ఉండాల్సింది’’ అని అన్నాడు.
Viral: వామ్మో! టెస్లా రూపొందించిన ఈ మనిషి లాంటి రోబోను చూశారా..