ఇద్దరూ సమంగా..
ABN , Publish Date - Nov 30 , 2024 | 04:55 AM
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మూడో రౌండ్లో విజయంతో అద్భుతంగా పుంజుకున్న భారత గ్రాండ్‌మాస్టర్ గుకేష్ ఆ తర్వాతి రౌండ్‌ను మాత్రం డ్రాగా ముగించాడు. డిఫెండింగ్ చాంపియన్, చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌తో
లిరెన్‌తో గుకేష్ నాలుగో రౌండ్ డ్రా
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్
సింగపూర్: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మూడో రౌండ్లో విజయంతో అద్భుతంగా పుంజుకున్న భారత గ్రాండ్‌మాస్టర్ గుకేష్ ఆ తర్వాతి రౌండ్‌ను మాత్రం డ్రాగా ముగించాడు. డిఫెండింగ్ చాంపియన్, చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌తో శుక్రవారం జరిగిన నాలుగో రౌండ్లో పాయింట్ పంచుకున్నాడు. నల్లపావులతో ఆడిన గుకేష్ ఆరంభంలో వెనుకంజలో ఉన్నా, ఆ తర్వాత పుంజుకొని గేమ్‌ను డ్రా దిశగా మళ్లించాడు. చివరికి 42 ఎత్తుల తర్వాత ఇరువురు ఆటగాళ్లు డ్రాకు అంగీకరించారు. బుధవారం జరిగిన మూడో రౌండ్లో 32 ఏళ్ల లిరెన్‌పై గుకేష్ గెలిచిన సంగతి తెలిసిందే. నాలుగో రౌండ్ తర్వాత ఇద్దరు ఆటగాళ్లు చెరి రెండు పాయింట్ల (2-2)తో సమంగా నిలిచారు. తొలి రౌండ్ ఓటమితో టోర్నీని ప్రారంభించిన 18 ఏళ్ల గుకేష్, రెండో రౌండ్‌ను డ్రా చేసుకున్నాడు. మరో పది రౌండ్లు మిగిలున్న ఈ టోర్నమెంట్లో ఎవరైతే ముందుగా 7.5 పాయింట్లకు చేరతారో వాళ్లు విజేతగా నిలుస్తారు. శనివారం జరిగే ఐదో రౌండ్లో గుకేష్ తెల్లపావులతో తలపడనున్నాడు.