Share News

వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ సమయాలు భారత ఫ్యాన్స్‌కు అనుకూలంగా..

ABN , Publish Date - Jun 06 , 2024 | 04:44 AM

భారత్‌లో క్రికెట్‌ అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఈసారి టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల సమయాలను నిర్ణయించినట్టు వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు (డబ్ల్యూఐసీబీ) సీఈవో...

వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ సమయాలు భారత ఫ్యాన్స్‌కు అనుకూలంగా..

బార్బడోస్‌ : భారత్‌లో క్రికెట్‌ అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఈసారి టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల సమయాలను నిర్ణయించినట్టు వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు (డబ్ల్యూఐసీబీ) సీఈవో జానీ గ్రేవ్‌ వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)కి సింహభాగం ఆదాయం భారత మార్కెట్‌నుంచే సమకూరుతుందని గుర్తు చేశాడు. అందువల్ల భారత అభిమానుల వీక్షణకు అనుగుణంగా మ్యాచ్‌ సమయాలను నిర్ణయించడంలో తప్పులేదన్నాడు.

Updated Date - Jun 06 , 2024 | 07:50 AM