Share News

Hardik Pandya: చెత్త కెప్టెన్సీ.. చెత్త బౌలింగ్.. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై దారుణ ట్రోలింగ్!

ABN , Publish Date - Apr 15 , 2024 | 11:38 AM

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అటు అభిమానుల నుంచి ఇటు మాజీ ఆటగాళ్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ సీజన్‌లో ముంబై టీమ్ నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. ఆదివారం స్వంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 20 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Hardik Pandya: చెత్త కెప్టెన్సీ.. చెత్త బౌలింగ్.. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై దారుణ ట్రోలింగ్!
హార్దిక్ పాండ్యా

ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అటు అభిమానుల నుంచి ఇటు మాజీ ఆటగాళ్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ సీజన్‌లో ముంబై టీమ్ నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. ఆదివారం స్వంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 20 పరుగుల తేడాతో ఓడిపోయింది (MI vs CSK). చివరి ఓవర్ బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. హార్దిక్ ఇచ్చిన పరుగులే ముంబై ఓటమికి కారణమని అభిమానులు విరుచుకుపడుతున్నారు (IPL 2024).


``చాలా కాలం తర్వాత చివరి ఓవర్లలో నేను చూసిన చెత్త బౌలింగ్ ఇదే. సాధారణ బౌలింగ్, సాధారణ కెప్టెన్సీ. సీఎస్కేను 185 పరుగులకే కట్టడి చేయాల్సింది. చెత్త నిర్ణయాల కారణంగా చెన్నై లాభపడింది. గత మ్యాచ్‌లో అమోఘంగా రాణించిన బుమ్రా బౌలింగ్ వేసేందుకు నాలుగో ఓవర్ వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. దూబె బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్పిన్నర్ల చేత బౌలింగ్ చేయించకూడదనే హార్దిక్ నిర్ణయం తప్పు. స్వయంగా అతడి బౌలింగ్ కూడా గాడి తప్పింది`` అంటూ మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ విమర్శించాడు.


మరోవైపు అభిమానులు కూడా హార్దిక్‌ను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. బాగా బౌలింగ్ చేస్తున్న వారిని హార్దిక్ పక్కనపెడుతున్నాడని, హార్దిక్ తల తిక్క నిర్ణయాల వల్లే ముంబై టీమ్ ఓటములు ఎదుర్కొంటోందని కామెంట్లు చేస్తున్నారు. ప్రతి మ్యాచ్‌లోనూ హార్దిక్ నిర్ణయాల వల్లే ముంబై ఓడిపోతోందని ట్రోలింగ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

MS Dhoni: హ్యాట్రిక్ సిక్స్‌లతో చెలరేగిన ధోనీ.. డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళుతూ ధోనీ చేసిన పనికి హ్యాట్సాఫ్!


IPL 2024: కళ్లు చెదిరే క్యాచ్ అంటే ఇదీ.. గాల్లో అద్భుత విన్యానం చేసిన కేకేఆర్ ఆటగాడు రమణ్ దీప్ సింగ్!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 15 , 2024 | 11:39 AM

News Hub