Share News

క్యారమ్‌ బాల్‌తో బౌల్డ్‌ చేశావు

ABN , Publish Date - Dec 23 , 2024 | 05:01 AM

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇటీవల వీడ్కోలు పలికిన రవిచంద్రన్‌ అశ్విన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఉద్వేగభరిత లేఖ రాశారు. భారత క్రికెట్‌కు అతడు అందించిన సేవలను కొనియాడారు...

క్యారమ్‌ బాల్‌తో బౌల్డ్‌ చేశావు

అశ్విన్‌కు మోదీ ఉద్వేగభరిత లేఖ

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌కు ఇటీవల వీడ్కోలు పలికిన రవిచంద్రన్‌ అశ్విన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఉద్వేగభరిత లేఖ రాశారు. భారత క్రికెట్‌కు అతడు అందించిన సేవలను కొనియాడారు. అశ్విన్‌ రిటైర్మెంట్‌ను అతడికే ప్రత్యేకమైన క్యారమ్‌ బాల్‌తో మోదీ పోల్చారు. ‘అంతర్జాతీయ క్రికెట్‌కు నీవు వీడ్కోలు పలకడం భారత్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను ఆశ్చర్యానికి లోనుచేసింది. వారంతా నీనుంచి దూసుకొచ్చే ఆఫ్‌బ్రేక్‌ బంతుల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఓ క్యారమ్‌ బాల్‌ విసిరి అందరినీ బౌల్డ్‌ చేశావు’ అని పేర్కొన్నారు. ‘క్రికెట్‌పట్ల నీ నిబద్ధత ప్రశ్నించలేనిది.. ఆసుపత్రిలో ఉన్న తల్లిని పరామర్శించి వెళ్లి మళ్లీ జట్టుకు సేవలందించడం ఆటపట్ల నీ చిత్తశుద్ధికి నిదర్శనం. వరదతో చెన్నై అతలాకుతలం అయినా కుటుంబం గురించి ఆందోళన చెందకుండా దక్షిణాఫ్రికాతో ఆడిన సందర్భం ఇంకా గుర్తుంది’ అని మోదీ ప్రశంసించారు.

Updated Date - Dec 23 , 2024 | 05:01 AM