Share News

Car Battery: కారు బ్యాటరీ త్వరగా అయిపోతుందా.. ఈ తప్పులు చేయకండి..

ABN , Publish Date - Nov 11 , 2024 | 12:35 PM

మీరు కూడా ఈ పొరపాట్లు చేస్తే కార్ బ్యాటరీ వేగంగా డ్రెయిన్ అవ్వడం ప్రారంభిస్తుంది. ఈ కారణంగా దాన్ని స్టార్ట్ చేయడంలో ఇబ్బందులు పడుతారు.

Car Battery: కారు బ్యాటరీ త్వరగా అయిపోతుందా.. ఈ తప్పులు చేయకండి..
car battery

కార్ బ్యాటరీ డ్రెయిన్: కారు బ్యాటరీ త్వరగా అయిపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. బ్యాటరీ త్వరగా డిశ్చార్జ్ కావడానికి 5 సాధారణ కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని రోజువారీ పొరపాట్లకు సంబంధించినవి ఉన్నాయి. వాటిని గమనించి కొంచెం శ్రద్ధతో సరిచేసుకోండి.

1. లైట్లను వదిలివేయడం:

చాలా మంది చాలా సార్లు కారు హెడ్‌లైట్లు, డోమ్ లైట్లు లేదా ఇతర లైట్లు పొరపాటున ఆఫ్ చేయడం మరచిపోతారు. ముఖ్యంగా కారు ఆఫ్‌లో ఉన్నప్పుడు ఇలా చేస్తే నెమ్మదిగా బ్యాటరీని డిశ్చార్జ్ చేస్తుంది. ఆటోమేటిక్ లైట్ ఆఫ్ ఫీచర్‌ను కలిగి ఉన్న కారుకు ఇటువంటి ఇబ్బంది ఉండదు. మిగితా కారు వాళ్లు కారును ఆఫ్‌లో ఉంచినప్పుడు లైట్లను కచ్చితంగా ఆఫ్‌లో పెట్టండి.

2. ఎక్కువ కాలం ఉపయోగించకపోవడం..

కారును క్రమం తప్పకుండా ఉపయోగించుకోవాలి. కారును డ్రైవ్ చేయకపోతే బ్యాటరీ ఛార్జ్ చేయలేకపోవచ్చు. కారును ఉపయోగించకుంటే ఇది నెమ్మదిగా బ్యాటరీ ఛార్జ్ ని తగ్గిస్తుంది. దీన్ని నివారించడానికి కారును ఎప్పటికప్పుడు కొంత సమయం పాటు డ్రైవ్ చేయాలి.

3. ఓవర్‌లోడ్ చేయబడిన ఉపకరణాల ఉపయోగం..

మ్యూజిక్ సిస్టమ్‌లు, ఛార్జర్‌లు, నావిగేషన్ సిస్టమ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వంటి అధిక ఉపకరణాలు బ్యాటరీపై అదనపు లోడ్ మోపుతాయి. కారు ఇంజిన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు ఈ పరికరాలు ఆన్‌లో ఉంటే బ్యాటరీ త్వరగా పోతుంది.

4. బ్యాటరీ జీవితం

సాధారణంగా కారు బ్యాటరీ 3-5 సంవత్సరాల వరకు ఉంటుంది. దాని తర్వాత దాని సామర్థ్యం తగ్గడం ప్రారంభమవుతుంది. పాత బ్యాటరీలు త్వరగా డిశ్చార్జ్ అవుతాయి. ముఖ్యంగా చల్లని వాతావరణంలో త్వరగా డ్రైన్ అవుతాయి. ఈ సమస్య తలెత్తకుండా బ్యాటరీని సమయానికి మార్చడం చాలా ముఖ్యం.

5. బ్యాటరీ కనెక్షన్ సమస్య లేదా తుప్పు:

బ్యాటరీ కనెక్షన్ సమస్య ఉన్నా లేదా టెర్మినల్స్‌లో తుప్పు పట్టినా బ్యాటరీ సరిగ్గా ఛార్జ్ కాకపోవచ్చు. దీని వల్ల బ్యాటరీ త్వరగా పోయే అవకాశం ఉంది. దీనిని శుభ్రంగా ఉంచడానికి, బ్యాటరీ టెర్మినల్స్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి శుభ్రం చేయాలి.

ఈ సమస్యలను నివారించడానికి, బ్యాటరీని సమయానికి సర్వీస్‌ చేయించండి. పైన పేర్కొన్న తప్పులను నివారించడానికి ప్రయత్నించండి.

Updated Date - Nov 11 , 2024 | 12:36 PM