Share News

స్కిల్‌ యూనివర్సిటీలో విశ్వకర్మలకు ప్రత్యేక కోర్సు

ABN , Publish Date - Sep 17 , 2024 | 11:39 PM

రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీలో విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కోర్సును ప్రవేశపెడతామని రాష్ట్ర ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ విశ్వకర్మల శ్రమ లేనిదే విశ్వంలో ఏ పని జరుగదని అన్నారు.

స్కిల్‌ యూనివర్సిటీలో విశ్వకర్మలకు ప్రత్యేక కోర్సు

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబర్‌ 17: రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీలో విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కోర్సును ప్రవేశపెడతామని రాష్ట్ర ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ విశ్వకర్మల శ్రమ లేనిదే విశ్వంలో ఏ పని జరుగదని అన్నారు. కులవృత్తులను ప్రోత్సహించడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని మంత్రి స్పష్టం చేశారు. పరిశ్రమలను ప్రోత్సహించి ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కరీంనగర్‌లో విశ్వకర్మ భవనం నిర్మించేందుకు ప్రభుత్వం స్థలం పరిశీలించాలని కలెక్టర్‌కు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌ ఫ్రఫుల్‌ దేశాయ్‌, ఆర్డీవో మహేశ్వర్‌, బీసీ సంక్షేమ అధికారి అనిల్‌, విశ్వకర్మ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2024 | 11:39 PM