Share News

Aadhaar Update: ఇంకా 10 రోజులే.. ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోండిలా

ABN , Publish Date - Sep 05 , 2024 | 08:02 AM

ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు దాటిన వారు తమ వివరాలను అప్‌డేట్(Aadhaar Update) చేసుకోవాలనే సంగతి తెలిసిందే.

Aadhaar Update: ఇంకా 10 రోజులే.. ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోండిలా

ఇంటర్నెట్ డెస్క్: ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు దాటిన వారు తమ వివరాలను అప్‌డేట్(Aadhaar Update) చేసుకోవాలనే సంగతి తెలిసిందే. ఫ్రీగా ఆధార్ అప్‌డేట్ చేసుకునే గడువు మరికొద్ది రోజుల్లో ముగియనుంది.

సెప్టెంబర్ 14 వరకు ఉచితంగా ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవచ్చని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) వెల్లడించింది. ఒకవేళ గడువు దాటితే రూ.50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.


యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మొదటగా ఆధార్ అప్‌డేట్ ప్రవేశపెట్టినప్పుడు రూ.50 ఫీజు వసూలు చేసింది. కానీ ప్రస్తుతం ఉచితంగానే అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. అప్‌డేట్‌లో ఆధార్ వినియోగదారుల పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నంబర్, ఈమెయిల్, వేలి ముద్రలు, ఫోటోగ్రాఫ్ తదితరాలు మార్చుకోవచ్చు.

ఆధార్‌ అప్‌డేట్ ఎందుకు?

ఆధార్ నియంత్రణ సంస్థ అయిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డు వివరాలను అప్‌డేట్ చేయడం తప్పనిసరి చేసింది. డేటా కచ్చితమైనదని, తాజా సమాచారమని నిర్దారించేందుకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఆధార్ కార్డులు అప్‌డేట్ చేసుకోవడం ద్వారా మోసాలకు చెక్ పెట్టొచ్చు. మహిళలకు వివాహం అయిన తర్వాత పేరు, చిరునామా వంటి ప్రాథమిక వివరాలు మారుతాయి.

పలువురు కొత్త ప్రాంతాలకు మారుతుంటారు. దీంతో చిరునామా, మొబైల్ నంబర్‌లో మార్పులు అవసరం అవుతాయి. ఇలా రకరకాల కారణంతో మార్పులు అవసరమైన వారు అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ చెబుతోంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 15 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.


ఆన్‌లైన్‌లో అప్‌డేట్ ఇలా..

  • UIDAI వెబ్‌సైట్‌ని సందర్శించండి. లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయండి.

  • My Aadhaar ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ట్యాబ్ చేసి Update Your Aadhaar అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

  • ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయండి. మీ ఆధార్ నంబర్, క్యాప్చా, ధృవీకరణ కోడ్‌ను నమోదు చేయండి. ఆ తర్వాత ఓటీపీపై క్లిక్ చేయండి.

  • మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ కావాలి.

  • మీరు అప్‌డేట్ చేయాలకున్న వివరాలను ఎంచుకోండి. కొత్త సమాచారాన్ని జాగ్రత్తగా ఎలాంటి తప్పులు లేకుండా ఎంటర్ చేయండి. ఆ తర్వాత సబ్‌మిట్ కొట్టండి.

  • మీ అప్‌డేట్ వివరాలను ధృవీకరించడానికి అవసరమైన సహాయక పత్రాలను స్కాన్‌ చేసి అప్‌లోడ్ చేయండి.

  • ప్రక్రియను పూర్తిచేయడానికి Submit Update Request అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

  • అలా మొబైల్ నంబర్‌కు మెసేజ్ రూపంలో యూఆర్‌ఎన్ (URN) నంబర్ ఇస్తుంది. దీనిని జాగ్రత్తగా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీ అప్‌డేట్ స్టేటస్‌ను ట్రాక్ చేసేందుకు ఉపయోగపడుతుంది.

  • లింక్ క్లిక్ చేసి నమోదును తనిఖీ చేయిపై క్లిక్ చేయండి.


ఆఫ్‌లైన్‌లో ఇలా..

ఆధార్‌ను ఆఫ్‌లైన్‌లో కూడా సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. దీని కోసం సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లాలి. ఆఫ్‌లైన్‌లో ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి రూ. 50 రుసుము చెల్లించాలి.

Read Latest National News and Telugu News

Updated Date - Sep 05 , 2024 | 08:02 AM