మెడలోంచి బంగారు పుస్తెలతాడు అపహరణ
ABN , Publish Date - Sep 21 , 2024 | 12:14 AM
నాందర్‌పూర్‌లో శుక్రవారం పట్టపగలు దొ ంగలు హల్‌చల్ చేశారు.
బొంరా్‌సపేట్, సెప్టెంబరు 20: నాందర్‌పూర్‌లో శుక్రవారం పట్టపగలు దొ ంగలు హల్‌చల్ చేశారు. వృద్ధురాలు చిట్లపల్లి లక్ష్మమ్మ రోడ్డు పక్కన దుకాణం నుంచి ఇంటికి వెళ్తుండగా పంచాయతీ సమీపంలో దుండగులు కత్తితో బెదిరించి మెడలోని బంగారు పుస్తెలతాడును తెంపుకెళ్లారు. దుండగులు పారిపోతుండగా ఖాళీబ్యాగు పడిపోయింది. ఎస్సై అబ్దుల్ రవూఫ్, కొడంగల్ సీఐ శ్రీధర్‌రెడ్డి అక్కడికి చేరుకొని దర్యాప్తు చేశారు. దుండగుల భాషను బట్టి వారు అంతరాష్ట్ర దొంగలుగా అనుమానిస్తున్నట్లు తెలిపారు. గతంలోనూ ఇలాంటి దొంగతనాలు జరిగినా పోలీసులు ఛేదించలేదు.
ధారూరు: ఆర్టీసీ బస్సులో ఓ మహిళ బ్యాగులోని బం గారం, వెండి నగలు చోరీ అయిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. యాదగిరిగుట్ట నుంచి తాండూర్ వస్తున్న ఎక్స్‌ప్రెస్ బస్సును డ్రైవర్ ధారూ రు పోలీసుస్టేషన్ వద్ద నిలిపి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రయాణికుల ందరినీ తనిఖీ చేసినా వస్తువులు దొరకలేదు. యాదగిరిగుట్ట నుంచి తాం డూర్‌కు వస్తున్న బస్సులో 100 మంది ఉన్నారు. వికారాబాద్‌లో ఓ మహిళ బస్సులో ఎక్కి కండక్టర్‌కు ఆధార్‌కార్డు చూపుతున్న సమయంలో తన బ్యాగులోని 2తులాల బంగారం గొలుసు, ఉంగరాలు, వెండి వస్తువులు లేవ ని గుర్తించింది. దీంతో డ్రైవర్ బస్సు నిలిపి విషయం పోలీసులకు చెప్పా రు. ఎస్‌ఐ వేణుగోపాల్‌గౌడ్ ఇద్దరు పోలీసులతో ప్రయాణికులను గంటపాటు త నిఖీ చేసినా వస్తువులు లభించలేదు. దీంతో బస్సును పంపించేశారు.