Share News

పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Dec 21 , 2024 | 11:29 PM

వనపర్తి జిల్లా కేంద్రంలో విద్యార్థి హరీష్‌ మృతికి కారణమైన పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవా లని ఏఐవైఎఫ్‌ వనపర్తి జిల్లా కార్యదర్శి కుతుబ్‌ డిమాండ్‌ చేశారు.

పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

ఆత్మకూరు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : వనపర్తి జిల్లా కేంద్రంలో విద్యార్థి హరీష్‌ మృతికి కారణమైన పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవా లని ఏఐవైఎఫ్‌ వనపర్తి జిల్లా కార్యదర్శి కుతుబ్‌ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆ త్మకూరు పట్టణ కేంద్రంలో శనివారం విలేకరు లతో మాట్లాడారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పెద్దమారూర్‌కి చెందిన హరీష్‌ జిల్లా సమీపంలోని రేడియంట్‌ పాఠశాలలో 9వ త రగతి చదువుతన్నాడన్నారు. పాఠశాల పక్కనే ఓ రైతు తన వేరుశనగ పంటకు పందులు రాకు ండా విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చాడని, అది తెలియని విద్యార్థి విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృ తి చెందాడన్నారు. పాఠశాల యాజమాన్యం నిర్ల క్ష్యం కారణంగానే విద్యార్థి మృతి చెందాడని అ న్నారు. విద్యార్థి మృతికి కారణమైన పాఠశాల యజమాన్యాన్ని తక్షణమే అరెస్టు చేసి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Dec 21 , 2024 | 11:29 PM