Share News

యాసంగికి ఢోకాలేనట్టే!

ABN , Publish Date - Dec 03 , 2024 | 12:46 AM

మూసీ రిజర్వాయర్‌ ఈ ఏడాది సైతం నీటితో కళకళలాడుతోంది. నాలుగేళ్లుగా ఆయకట్టులో రెండు పం టల సాగుకు నీటిని అందిస్తోంది.

 యాసంగికి ఢోకాలేనట్టే!
కళకళలాడుతున్న మూసీ

యాసంగికి ఢోకాలేనట్టే!

జూన నుంచి గరిష్ఠస్థాయిలోనే నీటిమట్టం

హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

కేతేపల్లి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): మూసీ రిజర్వాయర్‌ ఈ ఏడాది సైతం నీటితో కళకళలాడుతోంది. నాలుగేళ్లుగా ఆయకట్టులో రెండు పం టల సాగుకు నీటిని అందిస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండో భారీ నీటిపారుదల ప్రాజెక్టుగా ఉన్న మూసీ రిజర్వాయర్‌ ఈ ఏడాది కూ డా జలకళను సంతరించుకుంది. హైదరాబాద్‌ నగరంతో పాటు ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వచ్చే నీటితో ఈ ప్రాజెక్టు గత వేసవిలోనే జలకళను సంతరించుకుంది. ఆ తర్వాత వానాకా ల సీజన్‌లో కురిసిన వర్షాలకు తోడు హైదరాబా ద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల నుంచి వచ్చే వృ థా నీటితో ఈ ప్రాజెక్టుకు నిరంతరాయంగా ఇన్‌ఫ్లో కొనసాగుతూ వస్తుంది. దీంతో 645 అడుగులు (4.46టీఎంసీలు) పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం గల మూసీ ప్రాజెక్టు నీటిమట్టం గత జూన్‌ నుంచి గరిష్ఠ స్థాయిలోనే కొనసాగుతుంది. ఈ క్రమంలో ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ఆయకట్టులోని 30వేల పైచిలుకు ఎకరాల్లో వానాకాలం పంటల సాగుకు అధికారులు నీటిని విడుదల చేశారు. అయినా ఎగువ నుంచి వచ్చే నిరంతర ఇన్‌ఫ్లో కారణంగా ప్రాజెక్టు నీటిమట్టం ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. ఈ క్రమంలో ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా నకిరేకల్‌, సూర్యాపేట, మిర్యాలగూడెం, నల్లగొండ నియోజకవర్గాల పరిధిలోని ఆయకట్టు భూములకు యాసంగి సాగునీరు అందించేందుకు ప్రాజెక్టు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

30 వేల ఎకరాలకు అందనున్న సాగునీరు

జిల్లాలో 42 కిలోమీటర్ల పొడవు ప్రవహించే మూసీ ఎడమ కాల్వ సూర్యాపేట, చివ్వెంల, పెన్‌పహాడ్‌ మండలాల్లోని 15,230 ఎకరాలకు సాగునీటిని అందిస్తుంది. ఈ కాల్వ ద్వారా సూ ర్యాపేట నియోజకవర్గంలోని చివ్వెంల మండలంలో రెండు గ్రామాలు, పెన్‌పహాడ్‌ మండలం లో మూడు గ్రామాలు, సూర్యాపేట మండలం లో 16 గ్రామాలకు సాగునీటి సరఫరా జరుగుతుంది. 34 కిలోమీటర్ల పొడవున ప్రవహించే మూసీ కుడి కాల్వ కేతేపల్లి, వేములపల్లి, మా డ్గులపల్లి, తిప్పర్తి మండలాల్లోని 14,770 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఈ కాల్వ పరిధి లో నకిరేకల్‌ నియోజకవర్గంలోని కేతేపల్లి మం డలంలో 9 గ్రామాలు, మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలంలో 7 గ్రామా లు, నల్లగొండ నియోజకవర్గంలోని తిప్పర్తి, మా డ్గులపల్లి మండలాలకు చెందిన రెండేసి గ్రా మాలకు సాగునీరు అందుతుంది. ప్రతి ఏటా డిసెంబరు మూడో వారంలో ఈ ప్రాజెక్టు నుం చి ఆయకట్టుకు యాసంగి సాగునీటిని విడుద ల చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడా ది కూడా మూసీ ప్రాజెక్టు ఆయకట్టులో రెండో పంట సాగుకు నీరు అందనుండటంతో ఆయకట్టు రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తుంది.

రెండు పంటలకు నీరందడం ఆనందంగా ఉంది

మూసీ ప్రాజెక్టు ద్వారా నాలుగేళ్లుగా రెండు పంటలకు సాగునీటిని అందుతుంది. ఈ ఏడాది వానాకాలం పంట కోతలు పూర్తయ్యాయి. యాసంగికి సైతం నీటిని అందించేందుకు వీలుగా ప్రాజెక్టు నిండుగా ఉండటంతో ఆనందంగా ఉంది.

ఎం.నర్సయ్య,చీకటిగూడెం

ఆయకట్టుకు సరిపడా నీరు

ఈ ఏడాది యాసంగి సీజన్‌లో ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ఆయకట్టు రైతులు పంటలు సాగు చేసుకోవడానికి సాగునీటిని విడుదల చేస్తాం. ప్రాజెక్టులో సమృద్ధిగా నీటి నిల్వలు ఉండడంతో నీటి విడుదలలో ఎలాంటి ఇబ్బందులు లేవు. హైదరాబాద్‌లో ఉన్నతాధికారులతో జరిగే సమావేశంలో చర్చించి వారి సూచనల మేరకు నీటి విడుదల షెడ్యూలును ఖరారు చేస్తాం. ఆ మేరకు ఆయకట్టుకు విడతల వారీగా సాగునీటిని వదులుతాం.

ఎం.చంద్రశేఖర్‌, డీఈ, మూసీ ప్రాజెక్టు

Updated Date - Dec 03 , 2024 | 12:46 AM