రుణమేళాను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Dec 15 , 2024 | 11:49 PM
వనపర్తి పట్టణంలో నిర్వ హించనున్న జాబ్, స్కిల్ డెవలప్‌మెంట్, రుణమేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు.
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి
వనపర్తి అర్బన్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): వనపర్తి పట్టణంలో నిర్వ హించనున్న జాబ్, స్కిల్ డెవలప్‌మెంట్, రుణమేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకుల కోసం జాబ్ మేళా నిర్వహి స్తున్నట్లు తెలిపారు. ఈ నెల 21న నిర్వహించాల్సి ఉండగా అసెంబ్లీ సమావేశా ల నేపథ్యంలో వాయిదా వేశామని, త్వరలోనే తేదీని ఖరారు చేస్తామని తెలి పారు. ఆసక్తి గల యువతీ, యువకులు పూర్తి వివరాలకు స్థానికంగా ఉండే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. వ్యాపారం కోసం దాదాపు రూ.200 నుంచి రూ.300 కోట్ల వరకు రుణమేళా కూడా నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ... వనపర్తి నియో జకవర్గ యువత, వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యో గాలతో పాటు, వ్యాపార రంగాలలో రాణించేందుకు రుణమేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, మునిసిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, డీసీసీ డెలిగేట్ మెంబర్ శంకర్ ప్రసాద్, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.