Share News

అడవులు, వన్యప్రాణుల అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Oct 14 , 2024 | 11:50 PM

వరల్ట్‌వైడ్‌ ఫండ్‌ నేచర్‌ (డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్‌) వారి సహకారంతో రాష్ట్రంలోని అడవులు, వన్య ప్రాణుల సంర క్షణకు కృషి చేస్తున్నామని రాష్ట్ర అటవీశాఖ చీఫ్‌ వైల్ట్‌లైఫ్‌ వార్డెన్‌ ఏలూసింగ్‌ మేరూ అన్నారు.

అడవులు, వన్యప్రాణుల అభివృద్ధికి కృషి
బొలెరో వాహనాన్ని ప్రారంభిస్తున్న ఏలూసింగ్‌ మేరూ

మన్ననూర్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): వరల్ట్‌వైడ్‌ ఫండ్‌ నేచర్‌ (డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్‌) వారి సహకారంతో రాష్ట్రంలోని అడవులు, వన్య ప్రాణుల సంర క్షణకు కృషి చేస్తున్నామని రాష్ట్ర అటవీశాఖ చీఫ్‌ వైల్ట్‌లైఫ్‌ వార్డెన్‌ ఏలూసింగ్‌ మేరూ అన్నారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ వారి ఆర్థిక సాయంతో అందజేసిన బొలెరో వాహనాన్ని మన్న నూరు అటవీ పర్యావరణ విజ్ఞాన కేంద్రం ఆవరణలో సోమ వారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావే శంలో ఆయన మాట్లాడారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ ద్వారానే మాన వ మనుగడ సాధ్యపడుతుందన్నారు. వరల్ట్‌వైడ్‌ సంస్థ అటవీ శాఖకు ఆర్థిక వనరులను సమకూర్చడం అభినందనీయమని, వారితో కలిసి రాష్ట్రంలోని అడవుల్లో పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడుతున్నామని అన్నారు. 2005లో నల్లమల ప్రాంతంలోని పర్హాబాద్‌ వద్ద సౌరశక్తి బోర్‌ వేసి వన్యప్రాణులకు తాగునీటి సరఫరాకు శ్రీకారం చుట్టారని అన్నారు. అడవుల్లో పెద్దపులుల కదలి కలు తెలుసుకునేందుకు, స్మగ్లర్లు, వేటగాళ్లు అడవుల్లో చేసే నేరాలను అదుపు చేసేందుకు మెటల్‌ డిటెక్టర్లు, సీసీ ట్రాఫ్‌ కెమెరాలు, వాకీటాకీలు, జీపీఎస్‌ యూనిట్లు అందజేస్తున్నారని అన్నారు. అడవుల్లో జరిగే ప్రతీ ఘటనకు సంబం ధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు వైర్‌లెస్‌ టవర్ల నిర్మాణం చేపట్టారని అన్నారు. అమ్రాబాద్‌ అభయారణ్యంలో పెద్దపులుల సంఖ్య గణనీయంగా పెరుగుదలకు కృషి చేసిన అధికారులను, అటవీ ప్రొటెక్షన్‌ వాచర్లను అభినం దించారు. ఇదే స్పూర్తిని మున్ముందు ప్రదర్శించాలని కోరారు. ఏిపీ, తెలంగాణ విడిపోయిన తర్వాత డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ సహకారం తగ్గిందని, మున్ముందు సహకారం పెరగాల్సిన అవసరం ఉందని ఆ సంస్థ ప్రతినిధులకు విన్నవించా రు. కార్యక్రమంలో డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఇండియా సంస్థ చైర్మన్‌ అనిల్‌కుమార్‌ ఏపూర్‌, అటవీ క్షేత్ర సంచాలకులు(ఎఫ్‌డీ) శివాని డోగ్రా, డీఎఫ్‌వో రోహిత్‌ గోపిడి, ఎఫ్‌డీవో రామమూర్తి, డబ్ల్యూడబ్యూఎఫ్‌ డైరెక్టర్‌ ఫరీదా టాంఫాల్‌, ప్రతినిధి శ్రీనివాస్‌, రేంజ్‌ అధికారులు దేవజ, గురుప్రసాద్‌ ఉన్నారు.

Updated Date - Oct 14 , 2024 | 11:50 PM