Share News

AI: అప్పటికల్లా మానవ మేథను అధిగమించనున్న ఏఐ.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 13 , 2024 | 05:10 PM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) మానవ మేథస్సును మించి పని చేస్తుంది. ఎన్నో క్లిష్టమైన ప్రశ్నలు, సవాళ్లకు పరిష్కారం కనుక్కుంటుంది. మానవ మేథస్సుతో ఏఐ పోటీ అంశంపై శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు.

AI: అప్పటికల్లా మానవ మేథను అధిగమించనున్న ఏఐ.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు

న్యూయార్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) మానవ మేథస్సును మించి పని చేస్తుంది. ఎన్నో క్లిష్టమైన ప్రశ్నలు, సవాళ్లకు పరిష్కారం కనుక్కుంటుంది. మానవ మేథస్సుతో ఏఐ పోటీ అంశంపై శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. దీనికి తోడు ఏఐ మరింతగా వృద్ధి చెందితే.. అనేక రంగాలు గడ్డుకాలం ఎదుర్కుంటాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఎలాన్ మస్క్(Elon Musk) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ ముందు మనిషి తెలివితేటలు ఎందుకూ పనికి రావని తెలిసే రోజులు ఎంతో దూరంలో లేవని ఆయన అన్నారు.

2029 నాటికి మాన‌వ మేథ‌ను ఏఐ అధిగ‌మిస్తుంద‌ని మ‌స్క్ అంచ‌నా వేశారు. మాన‌వ మేథ‌స్సు స్ధాయిని 2029 నాటికి ఏఐ అధిగ‌మించ‌గ‌ల‌ద‌ని ఫ్యూచ‌రిస్ట్ రే కుజ్‌వెల్ చెప్పారు. ఏఐ మాన‌వ మేథ‌ను అధిగ‌మించేందుకు మ‌రో వందేండ్లు ప‌డుతుంద‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నార‌ని, కానీ మ‌రో ఐదేండ్ల‌లోనే ఇది సాధ్య‌మ‌వుతుంద‌ని కుజ్‌వెల్ స్పష్టం చేశారు. వారి కామెంట్స్ ఐటీ నిపుణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 13 , 2024 | 05:10 PM