Google Tracking: మీ లొకేషన్‌ను గూగుల్ ట్రాక్ చేయొద్దని కోరుకుంటున్నారా? ఇలా చేస్తే సరి
ABN , Publish Date - Dec 06 , 2024 | 09:28 AM
గూగుల్ యూజర్ల లొకేషన్‌ను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తుందని కూడా చాలా మందికి తెలుసు. అయితే, జీపీఎస్ అవసరం లేకుండానే యాండ్రాయిడ్ డివైజులు యూజర్ల కదలికలను గుర్తించగలవు. ఇది తమ వ్యక్తిగత గోప్యతకు భంగకరమని భావించేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే యాండ్రాయిడ్ డివైజులు వారిని ట్రాక్ చేయలేవని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: గూగుల్ మ్యాప్స్ గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. మ్యాప్స్‌లో కొన్ని లోటుపాట్లు ఉన్నా కూడా అనేక మంది కొత్త ప్రదేశాలకు వెళ్లేందుకు మ్యాప్స్‌నే వినియోగిస్తారు. ఈ సందర్భంగా గూగుల్ యూజర్ల లొకేషన్‌ను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తుందని కూడా చాలా మందికి తెలుసు. అయితే, జీపీఎస్ అవసరం లేకుండానే యాండ్రాయిడ్ డివైజులు యూజర్ల కదలికలను గుర్తించగలవు. ఇది తమ వ్యక్తిగత గోప్యతకు భంగకరమని భావించేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే యాండ్రాయిడ్ డివైజులు వారిని ట్రాక్ చేయలేవని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం (Technology).
8000mAh Battery: వామ్మో.. స్మార్ట్ ఫోన్లల్లో ఇకపై 8000 ఎమ్ఏహెచ్ బ్యాటరీలు!
అసలు గూగుల్ మీ లొకేషన్‌ను ఎలా ట్రాక్ చేస్తుందంటే..
మీరు కనెక్టై ఉన్న వైఫై నెట్‌వర్క్‌ల ద్వారా గూగుల్ మీ లొకేషన్‌ను గుర్తించగలదు. మీ డివైజ్ కనెక్టై ఉన్న రౌటర్ల సిగ్నల్ ఎంత ఎక్కువ ఉందో గుర్తించి ట్రయాంగ్యులేషన్ పద్ధతిలో గూగుల్ మీ లొకేషన్‌ను అంచనా వేయగలదు.
ఓ ప్రాంతంలోని వైఫై నెట్‌వర్క్‌ల గురించి గూగుల్ వద్ద అనంతమైన సమాచారం ఉంది. యూజర్ డివైజ్‌ల నుంచి గూగుల్ ఈ వివరాలను సేకరించింది. వీటిని గూగుల్ వినియోగదారుల లొకేషన్‌ను అత్యంత కచ్చితత్వంతో అంచనా వేసేందుకు ఉపయోగించుకుంటుంది
మన డివైజ్‌లు నిత్యం సమీపంలోని సెల్‌టవర్‌తో అనుసంధానమై ఉంటాయి. ఈ నేపథ్యంలో వివిధ సెల్‌టవర్ల నుంచి సిగ్నల్స్ సామర్థ్యం ఎంత ఉందో గూగుల్ అంచనా వేసి డివైజ్ లొకేషన్‌ను ట్రయాంగ్యులేషన్ పద్ధతిలో గుర్తిస్తుంది. ఈ విధానం జీపీఎస్ అంత కచ్చితమైనది కాకపోయినప్పటికీ స్థూలంగా యూజర్ ఎక్కడ ఉన్నారనేది తెలుస్తుంది.
Pixel Laptop: త్వరలో పిక్సెల్ లాప్‌టాప్ లాంచ్ చేయనున్న గూగుల్?
సమీపంలోని బ్లూటూత్ డివైజుల నుంచి వచ్చే సిగ్నల్స్‌ను, పబ్లిక్ ప్లేసుల్లోని సిగ్నల్స్‌ను గూగుల్ గుర్తించగలదు. ఈ సిగ్నల్ స్ట్రెంగ్త్ ఆధారంగా ఓ డివైజ్ ఎక్కడ ఉందనేది అంచనా వేస్తుంది
ఇంటర్నెట్‌కు అనుసంధానమైన ఉన్న ప్రతి డివైజ్‌కు ఓ ఐపీ అడ్రస్ ఉంటుంది. దీని ద్వారా కూడా డివైజ్‌లోకేషన్‌ను కొంత మేర అంచనా వేయొచ్చు
యూజర్లు తమంతట తాముగా గూగుల్ సర్వీసులకు ఇచ్చే యాక్సెస్ ద్వారా కూడా లొకేషన్ వివరాలు గూగుల్‌కు చేరుతాయి.
ఆక్సెలెరోమీటర్లు, గైరోస్కోపులు డివైజులు ఏ దిశలో ఎలా ఉన్నాయో గుర్తించగలవు. ఈ సమాచారాన్ని ఇతర ట్రాకింగ్ విధానాలతో జత చేసి గూగుల్ డివైజ్ లొకేషన్‌ను అంచనా వేస్తుంది.
యూజర్ల లొకేషన్‌ను తెలుసుకునే అనుమతులు ఉన్న యాప్స్ జియోఫెన్సింగ్ విధానాన్ని ఉపయోగిస్తాయి. వీటి సాయంతో యాప్స్ యూజర్లు ఏదైనా ప్రత్యేక ప్రాంతానికి చేరుకోగానే నోటిఫికేషన్లు పంపిస్తుంటాయి. ఈ సమాచారం ఆధారంగా కూడా గూగుల్ యూజర్ల లొకేషన్‌ను గుర్తించగలదు.
ఇక గూగుల్ యూజర్లను ట్రాక్ చేయొద్దంటే..
లొకేషన్ ట్రాకింగ్‌ను ఆపేందుకు యూజర్లు తమ గూగుల్ అకౌంట్‌లోని మై ఆక్టివిటీ సెక్షన్‌కు వెళ్లాలి. అందులోని యాక్సెస్ ఆప్షన్‌లో గల యాక్టివిటీ కంట్రోల్‌లోకి వెళ్లాలి. అందులోని వెబ్ అండ్ యాప్ యాక్టివిటీలోకి వెళ్లి.. లొకేషన్ హిస్టరీ ఫీచర్‌ను డిజేబుల్ చేస్తే యూజర్ల లొకేషన్ చరిత్ర అకౌంట్‌లో సేవ్ కాకుండా ఉంటుంది.
ఇప్పటికే అకౌంట్‌లో సేవ్ అయి ఉన్న గూగుల్ యాక్టివిటీని డిలీట్ చేసేందుకు డిలీట్ యాక్టివిటీలో టైం ఎంచుకుని డిలీట్ చేస్తే ఆ సమయానికి చెందిన లొకేషన్ డాటా మొత్తం చెరిగిపోతుంది.
మేనేజ్ మై యాక్టివిటీ వెరిఫికేషన్ ఆప్షన్ ద్వారా పాస్‌వర్డ్ సెట్ చేసుకుంటే డాటా భద్రంగా ఉంటుంది. కావాలనుకుంటే ఆటో డిలీట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. దీనితో లోకేషన్ డాటా ఎప్పటికప్పుడు డిలీట్ అయిపోతుంది.
సెట్టింగ్స్ ఆప్షన్ ద్వారా ట్రాకింగ్ యాక్టివిటీని పూర్తిగా డిజేబుల్ చేయొచ్చు. యూజ్ లొకేషణ్ ఆప్షన్‌ను డిజేబుల్ చేయడం లేదా లొకేషన్ అనుమతులను కొన్ని యాప్స్‌కే పరిమితం చేయడం కూడా ఆశించిన ఫలితాన్ని ఇస్తుంది.
For More Technology News and Telugu News