Share News

Aadhaar Misuse: మీ ఆధార్ మరెవరైనా వాడుతున్నారని డౌటా? ఇలా చేస్తే సరి

ABN , Publish Date - Nov 16 , 2024 | 09:17 PM

అనేక మంది తమ ఆధార్ కార్డు దుర్వినియోగమైందేమోనని సందేహిస్తుంటారు. ఇలాంటి సందేహాలు నివృత్తి చేసుకునేందుకు ఆధార్ వ్యవస్థలో సదుపాయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆధార్ దుర్వినియోగమైందీ లేనిదీ నేరుగా తెలియకపోయినా గతంలో తమ ఆధార్ ఎక్కడ వినియోగమైందీ వ్యక్తులు తెలుసుకోవచ్చని అంటున్నారు.

Aadhaar Misuse: మీ ఆధార్ మరెవరైనా వాడుతున్నారని డౌటా? ఇలా చేస్తే సరి

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో నివసిస్తున్న వారికి ఆధార్ కార్డు ముఖ్యమైన గుర్తింపు కార్డుగా మారింది. ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్ సేవలు, టెలికాం కనెక్షన్లు వంటి సదుపాయాలన్నీ పొందేందుకు ఆధార్ కీలకంగా మారింది. అయితే, సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేటి తరుణంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వ్యక్తిగత సమాచారం లీకయ్యే ప్రమాదం ఉంది. దొంగిలించిన ఆధార్ సమాచారంతో నిందితులు ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఘటన గతంలో వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా అమాయకులకు ఇబ్బందులు పాలైయ్యారు. (Aadhaar).

ఈ నేపథ్యంలో అనేక మంది తమ ఆధార్ కార్డు దుర్వినియోగమైందేమోనని సందేహిస్తుంటారు. ఇలాంటి సందేహాలు నివృత్తి చేసుకునేందుకు ఆధార్ వ్యవస్థలో సదుపాయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆధార్ దుర్వినియోగమైందీ లేనిదీ నేరుగా తెలియకపోయినా గతంలో తమ ఆధార్ ఎక్కడ వినియోగమైందీ వ్యక్తులు తెలుసుకోవచ్చని అంటున్నారు.

Aadhar Card: ఆధార్‌కి కొత్త నంబర్ లింక్ చేసుకోవాలా.. అయితే ఇలా చేయండి..


ఆధార్ వినియోగంపై నిఘా పెట్టేందుకు ఇలా చేయాలి..

  • ముందుగా మైఆధార్ పోర్టల్‌కు వెళ్లాలి.

  • అక్కడ ఆధార్ నెంబర్, కాప్చా కోడ్ ఎంటర్ చేశాక లాగిన్ విత్ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి

  • అనంతరం, మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని పోర్టల్‌లో ఎంటర్ చేస్తే వ్యక్తుల ఖాతా అందుబాటులోకి వస్తుంది.

  • ఇందులోని ఆథెంటికేషన్ హిస్టరీ ద్వారా ఆధార్ ఎప్పుడెప్పుడు వినియోగించిందీ తెలుసుకోవచ్చు.

  • ఇందులో అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే యూఊడీఏఐకి వెంటనే ఫిర్యాదు చేయాలి.

  • 1947 టాల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి లేదా help@uidai.gov.in కు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని సైబర్ భద్రతా నిపుణులు చెబుతున్నారు.

ఇక ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు యూఏడీఏఐ పలు భద్రతా ఫీచర్లు అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా యూజర్లు తమ బయోమెట్రిక్ ఆథెంటికేషన్‌‌ను లాక్ చేసుకోవచ్చు. అవసరమైన సందర్భాల్లో మళ్లీ అన్‌లాక్ చేసుకోవచ్చు.


ఆధార్ బయోమెట్రిక్స్ లాక్ చేయాలంటే..

  • ముందు యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి

  • లాక్/అన్‌లాక్ సెక్షన్‌ను ఎంచుకోవాలి

  • ఆ తరువాత స్క్రీన్‌పై కనిపించే మార్గదర్శకాలను కూలంకషంగా చదవాలి.

  • అనంతరం వర్చువల్ ఐడీ, పేరు, పిన్ కోడ్, క్యాప్చా‌ కోడ్‌ను ఎంటర్ చేయాలి.

  • తరువాత సెండ్ ఓటీపీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మొబైల్‌కు వచ్చే మెసేజ్‌లోని ఓటీపీని పోర్టల్‌లో ఎంటర్ చేయాలి.

  • ఆ తరువాత బయోమెట్రిక్స్ ఆథెంటికేషన్‌ను లాక్ చేసుకోవాలి.

Read More Business News and Latest Telugu News

Updated Date - Nov 16 , 2024 | 09:22 PM