Home » Cyber Crime
సైబర్ నేరగాళ్ల దృష్టి విద్యార్థుల పైనా పడింది. ట్యాబ్స్ కొనుగోలు కోసం వారి బ్యాంకు ఖాతాల్లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జమ చేసిన సొమ్మును అక్రమ మార్గాల్లో బదిలీ చేయించుకున్నారు.
అనేక మంది తమ ఆధార్ కార్డు దుర్వినియోగమైందేమోనని సందేహిస్తుంటారు. ఇలాంటి సందేహాలు నివృత్తి చేసుకునేందుకు ఆధార్ వ్యవస్థలో సదుపాయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆధార్ దుర్వినియోగమైందీ లేనిదీ నేరుగా తెలియకపోయినా గతంలో తమ ఆధార్ ఎక్కడ వినియోగమైందీ వ్యక్తులు తెలుసుకోవచ్చని అంటున్నారు.
డీహెచ్ఎల్ కొరియర్ సర్వీసు పేరుతో ముంబై నుంచి చైనాకు వెళ్తున్న పార్శిల్లో చట్టవ్యతిరేక వస్తువులు దొరికాయంటూ నగరానికి చెందిన యువకుడిని సైబర్ కేటుగాళ్లు(Cyber criminals) బెదిరించి రూ. 6.90 లక్షలు కాజేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 28 ఏళ్ల యువకుడికి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేశారు.
సైబర్ నేరగాళ్లు ఈ మధ్య వీడియో కాల్స్ చేసి.. ‘మీరు మనీలాండరింగ్ కుంభకోణంలో ఇరుక్కున్నారు.
సైబర్ నేరగాళ్లు(Cyber criminals) కాజేసిన డబ్బును రికవరీ చేసిన సైబర్‌క్రైం పోలీసులు బాధితుడి ఖాతాలో జమ చేయించారు. బ్యాంకు అధికారులమంటూ నగరానికి చెందిన వ్యక్తికి ఫోన్‌చేసిన సైబర్ నేరగాళ్లు.. క్రెడిట్ కార్డు లిమిట్(Credit card limit) పెంచుతామని చెప్పారు.
కమీషన్ల కోసం కక్కుర్తిపడి సైబర్ నేరగాళ్లు లావాదేవీలు చేసుకునేందుకు బ్యాంకు ఖాతాలను ఇస్తోన్న ఓ ముఠాను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. రాష్ట్రంలో నమోదైన 508 సైబర్ నేరాల్లో నిందితులుగా ఉన్న ఓ ముఠాకు చెందిన 48 మందిని అరెస్ట్ చేశారు.
సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం కోసం స్పెషల్ ఆపరేషన్ నిర్వహించామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. ఆ క్రమంలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి.. విచారిస్తే...డొంకంతా కదిలిందన్నారు. దీంతో సైబర్ నేరాల్లో ప్రమేయమున్న 48 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. వీరిలో అత్యధిక శాతం మంది విద్యావంతులేనని ఆమె చెప్పారు.
ఆన్లైన్ పార్ట్‌టైం జాబ్ పేరుతో సైబర్ నేరగాళ్లు(Cyber criminals) రూ.1.45 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి(25) ఆన్లైన్ పార్ట్‌టైం జాబ్(Online part-time job) ప్రకటన చూసి వారిని సంప్రదించాడు. చిన్నపాటి టాస్క్‌లు చేస్తే డబ్బులు చెల్లిస్తామని చెప్పిన నేరగాళ్లు టెలిగ్రాం గ్రూపులో చేర్చారు.
పోలీసుల దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు సైబర్ నేరగాళ్లు(Cyber criminals) కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. మోసం చేసి కాజేసిన డబ్బును అమాయకుల ఖాతాలకు మళ్లిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా బ్యాంక్ లావాదేవీలు జరిగిన ఖాతాలను పోలీసు అధికారులు ఫ్రీజ్ చేస్తున్నారు.
పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు లాంటి వ్యక్తిగత వివరాలు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారా? భారీ డిస్కౌంట్ల పేరుతో ఊరించే ప్రకటనల లింక్‌లు క్లిక్ చేస్తున్నారా? అయితే మీరు సైబర్ మోసగాళ్ల వలలో చిక్కే ప్రమాదం ఉన్నట్టే. దేశంలో సైబర్ మోసాలు పెద్దఎత్తున పెరుగుతున్నాయి.