Share News

భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరాలి

ABN , Publish Date - Dec 23 , 2024 | 11:42 PM

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం వారి భవిష్యత్తు కో సం ఎంతో వెచ్చిస్తోందని విద్యార్థులు వాటిని సద్విని యోగం చేసుకుని జీవి తంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి పేర్కొన్నారు.

భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

వనపర్తి రూరల్‌, డిసెం బరు 23 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం వారి భవిష్యత్తు కో సం ఎంతో వెచ్చిస్తోందని విద్యార్థులు వాటిని సద్విని యోగం చేసుకుని జీవి తంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పీర్లగుట్టలోని ప్రభుత్వ సాంఘిక స ంక్షేమ బాలికల వసతి గృహాన్ని కలెక్టర్‌ సందర్శి ంచారు. వసతి గృహ విద్యార్థినులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన ఆల్‌ ఇన్‌ వన్‌ స్టడీ మెటీరి యల్స్‌, బ్లాంకెట్లను, స్వెటర్లు, రింగ్‌ బాల్స్‌, చెస్‌ మెటీరియల్స్‌, సహా పలు ఆట వస్తువులను పం పిణీ చేసి మాట్లాడారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాల్ని, ఈ సదుపాయాలను చక్కగా వినియోగించుకుని జీవితంలో ఉన్నత శి ఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

Updated Date - Dec 23 , 2024 | 11:42 PM