Share News

Redmi 13 5G: రూ.13,999లకే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ విడుదల చేసిన రెడ్‌మీ

ABN , Publish Date - Jul 09 , 2024 | 06:32 PM

బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి షియోమీ (Xiaomi) సబ్‌-బ్రాండ్ కంపెనీ రెడ్‌మీ (Redmi) గుడ్‌న్యూస్ చెప్పింది. రూ.13,999 ధరలలో అదిరిపోయే కొత్త 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. రెడ్‌మీ 13 5జీని (Redmi 13 5G) భారత మార్కెట్‌లో విడుదల చేసింది.

Redmi 13 5G: రూ.13,999లకే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ విడుదల చేసిన రెడ్‌మీ
Redmi 13 5G

బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి షియోమీ (Xiaomi) సబ్‌-బ్రాండ్ కంపెనీ రెడ్‌మీ (Redmi) గుడ్‌న్యూస్ చెప్పింది. రూ.13,999 ధరలలో అదిరిపోయే కొత్త 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. రెడ్‌మీ 13 5జీని (Redmi 13 5G) భారత మార్కెట్‌లో విడుదల చేసింది. గతంలో విడుదలైన చక్కటి ఆదరణ పొందిన రెడ్‌మీ 12 5జీ స్థానంలో ఈ ఫోన్‌‌ను ప్రవేశపెట్టింది. రెడ్‌మీ13 5జీ హవాయి బ్లూ, బ్లాక్ డైమండ్, ఆర్చిడ్ పింక్ రంగులలో ఈ ఫోన్ లభ్యమవుతోంది. దీని ధర 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ.13,999, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,499గా ఉంది.


స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ఏఈ (యాక్సిలరేటెడ్ ఎడిషన్) చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 33వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌, 5,030ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఇక జులై 12న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో పాటు రెడ్‌మీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్, రిటైల్ స్టోర్లలో కూడా ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. కాగా అర్హత కలిగిన కస్టమర్లు బ్యాంక్ ఆఫర్లు లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల ద్వారా రూ.1000 తగ్గింపును కూడా పొందవచ్చు.


ఈ స్మార్ట్‌ఫోన్ 1080 x 2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.79-అంగుళాల పూర్తి హెడ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120హెట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. ఫోటోలు, వీడియోల కోసం రెడ్‌మీ 13 5జీ 108-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ప్రైమరీ కెమెరా 3రెట్ల ఇన్-సెన్సర్ జూమ్‌ను అందిస్తోంది. అదనంగా 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది. ఇక 5జీ, 4జీ ఎల్‌టీఈ కనెక్టవిటీ, డ్యూయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.4, జీపీఎస్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.

Updated Date - Jul 09 , 2024 | 06:33 PM