Share News

Alert: ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. ఈ డేంజర్ వైరస్ పట్ల జాగ్రత్త..!

ABN , Publish Date - Aug 03 , 2024 | 08:49 PM

మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్(smart phone) వాడుతున్నారా, అయితే జాగ్రత్త. ఎందుకంటే Clefi అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు(customers) గోప్యత గురించి హెచ్చరించింది. దీని ప్రకారం ఓ మాల్వేర్ ఆండ్రాయిడ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుందని వెల్లడించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Alert: ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. ఈ డేంజర్ వైరస్ పట్ల జాగ్రత్త..!
smartphone malware

మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్(smart phone) వాడుతున్నారా, అయితే జాగ్రత్త. ఎందుకంటే Clefi అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు(customers) గోప్యత గురించి హెచ్చరించింది. దీని ప్రకారం ఓ మాల్వేర్ ఆండ్రాయిడ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుందని వెల్లడించింది. దీని ద్వారా యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం జరుగుతుందని తెలిపింది. ఆ తర్వాత దాని సాయంతో అనేక మోసాలకు పాల్పడున్నారని తెలిపింది. దీంతో ఈ మాల్వేర్(malware) నుంచి తమను తాము సురక్షితంగా ఉంచుకోవాలని సూచనలు జారీ చేసింది. ఇలాంటి సమయంలో వినియోగదారులు ఎలాంటి తప్పులు చేయకూడదనే విషయాలను కూడా వెల్లడించింది.


మోసాలకు

ఈ క్రమంలో BingoMod అనే ఈ మాల్వేర్ నుంచి మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవాలని సూచించింది. Clefi అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రకారం ఈ తాజా మాల్వేర్ ఆండ్రాయిడ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటోంది. దీని ద్వారా యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉంది. ఆ తర్వాత దాని సాయంతో మోసాలకు పాల్పడుతున్నారు. BingoMod నిజమైన యాంటీవైరస్ అనువర్తనం వలె కనిపిస్తుంది. దీని కారణంగా చాలా మంది ప్రజలు మోసపోతారని తెలిపింది. అయితే దీని వల్ల వచ్చే కొత్త సమస్య ఏమిటనే వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.


ఎక్కడ కోల్పోతారు?

ఈ నేపథ్యంలో వ్యక్తులను ట్రాప్ చేయడానికి వారి స్మార్ట్‌ఫోన్లకు(smart phones) సందేశాలు పంపబడతాయి. నకిలీ యాప్‌లను డౌన్‌లోడ్ చేయమని అడుగుతారు. అయితే అనుకోకుండా చాలా మంది వాటిని క్లిక్ చేసి ఈ ఉచ్చులో పడుతున్నారు. ఇది వారికి అనేక రకాల సమాచారాన్ని అందిస్తుంది. ఏదైనా యాప్‌ను ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు, మీరు లొకేషన్, కాంటాక్ట్, గ్యాలరీకి యాక్సెస్ ఇస్తుంటారు. ఇందులో కూడా సరిగ్గా అదే జరుగుతుంది. యాక్సెస్ మంజూరు అయిన తర్వాత మీ సున్నితమైన సమాచారం హ్యాకర్ల అందుబాటులోకి వచ్చేస్తుంది. మీరు ఆ యాప్‌కు యాక్సెస్ ఇస్తే మీ సమాచారం అంతా హ్యాకర్లకు చేరే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ క్రమంలో మిమ్మల్ని మీరు స్మార్ట్‌ఫోన్ల విషయంలో సురక్షితంగా ఉంచుకోవాలన్నారు.

ఇవి కూడా చదవండి:

Jeff Bezos: అమెజాన్ జెఫ్ బెజోస్‌కు భారీ దెబ్బ.. ఎలాన్ మస్క్, అంబానీ మనీ కూడా..


ఈ రకమైన మాల్వేర్ నుంచి తమను తాము సురక్షితంగా ఉంచుకోవడం కోసం ఈ పొరపాట్లు చేయకూడదని సూచించింది.

1. పొరపాటున కూడా ఏ అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేయోద్దు

2. ఏదైనా నకిలీ వెబ్‌సైట్ నుంచి యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడంలో పొరపాటు చేయవద్దు

3. మీకు తెలియని నంబర్ నుంచి కాల్ లేదా మెసేజ్ వస్తే దానికి స్పందించకండి

4. మీకు ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే సమీపంలోని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయండి


ఇవి కూడా చదవండి:

School Time: గూగుల్ నుంచి 'స్కూల్ టైమ్' ఫీచర్.. రీల్స్ చూస్తే ఇకపై..

Display Replacement: ఈ వినియోగదారులకు ఫ్రీ డిస్‌ప్లే రీప్లేస్‌మెంట్‌.. క్రేజీ ఆఫర్ ప్రకటించిన సంస్థ..

Trending Stock: ఇన్వెస్టర్ల పంట పండింది.. ఏడాదిలో 77% లాభాలను ఇచ్చిన షేర్లు..

For More Technology News and Telugu News..

Updated Date - Aug 03 , 2024 | 08:59 PM