Share News

SIM cards: అలా చేస్తే సిమ్ కార్డులు బ్లాక్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్ ప్రవేశపెట్టిన ట్రాయ్!

ABN , Publish Date - Aug 11 , 2024 | 07:24 PM

ఇటీవలి కాలంలో విపరీతంగా పెరుగుతున్న స్పామ్ కాల్స్, సైబర్ నేరాలను దృష్టిలో పెట్టుకుని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఓ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొస్తోంది. వినియోగదారుల సమస్యలకు చెక్ పెట్టేందుకు నిబంధనలను కఠినతరం చేయబోతోంది.

SIM cards: అలా చేస్తే సిమ్ కార్డులు బ్లాక్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్ ప్రవేశపెట్టిన ట్రాయ్!
New SIM card regulations to tackle fake calls

ఇటీవలి కాలంలో విపరీతంగా పెరుగుతున్న స్పామ్ కాల్స్ (Spam Calls), సైబర్ నేరాలను దృష్టిలో పెట్టుకుని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (Trai) ఓ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొస్తోంది. వినియోగదారుల సమస్యలకు చెక్ పెట్టేందుకు నిబంధనలను కఠినతరం చేయబోతోంది. ఈ మేరకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌కు ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆ నిబంధనలు అమల్లోకి రాబోతున్నట్టు ట్రాయ్ తెలిపింది (New SIM card regulations).


ఈ కొత్త నిబంధన ప్రకారం.. ప్రైవేట్ మొబైల్ నెంబర్ నుంచి టెలీ మార్కెటింగ్ (Tele Marketing) కాల్ చేస్తే టెలికాం ప్రొవైడర్ ఆ నెంబర్‌ను రెండు సంవత్సరాల పాటు బ్లాక్ (Sim Block) చేయాలి. స్పామ్ కాల్స్ పేరుతో మోసాలు విపరీతంగా పెరిగిపోతుండడంతో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్ డేటా ప్రకారం గత మూడు నెలల్లో పది వేల కంటే ఎక్కువ మోసపూరిత స్పామ్ కాల్స్ పేరిట ఫిర్యాదులు నమోదయ్యాయి. ట్రాయ్ కొత్త నిబంధన ప్రకారం ఈ స్పామ్ కాల్స్‌కు టెలికాం ఆపరేటర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది.


ప్రైవేట్ నెంబర్ నుంచి టెలీ మార్కెటింగ్ (Tele marketing) కాల్స్ వచ్చినట్టు వినియోగదారులు ఫిర్యాదు చేస్తే టెలికాం ఆపరేటర్లు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. విచారణ జరిపి సదరు నెంబర్‌ను రెండు సంవత్సరాల పాటు బ్లాక్ చేయాలి. ఇకపై ఎవరైనా వ్యక్తిగత నెంబర్ నుంచి ఫోన్ చేసి టెలీ మార్కెటింగ్, ప్రమోషన్ వంటివి చేస్తే ఇబ్బందులకు గురి కాక తప్పదు. ఈ రూల్ కారణంగా స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్ తగ్గుతాయని ట్రాయ్ భావిస్తోంది.

Updated Date - Aug 11 , 2024 | 07:24 PM