Truecaller: స్పామ్ కాల్స్ వస్తున్నాయా.. ట్రూకాలర్‌లో ఈ ఫీచర్‌తో ఈజీగా గుర్తించవచ్చు
ABN , Publish Date - May 30 , 2024 | 07:12 AM
వినియోగదారుల ఫోన్ కాల్స్‌ని ట్రాక్ చేయడానికి, ఫ్రాడ్ కాల్స్ వస్తుంటే వాటిపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి ట్రూకాలర్(Truecaller ) ఇటీవల ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ కాల్ స్కానర్(AI Call Scanner)ను ప్రారంభించింది. ఇది AI వాయిస్ స్కామ్ డిటెక్షన్ టెక్నాలజీతో వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: వినియోగదారుల ఫోన్ కాల్స్‌ని ట్రాక్ చేయడానికి, ఫ్రాడ్ కాల్స్ వస్తుంటే వాటిపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి ట్రూకాలర్(Truecaller) ఇటీవల ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ కాల్ స్కానర్(AI Call Scanner)ను ప్రారంభించింది.
ఇది AI వాయిస్ స్కామ్ డిటెక్షన్ టెక్నాలజీతో వచ్చింది. ఈ వినూత్న ఫీచర్ AIతో ఉత్పత్తి చేసిన వాయిస్ స్కామ్‌లతో పెరుగుతున్న ముప్పును ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. AI కాల్ స్కానర్ తొలుత ఆండ్రాయిడ్‌లో (అమెరికాలో) ట్రూకాలర్ ప్రీమియం వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. రానున్న రోజుల్లో భారత్‌కి కూడా విస్తరించనున్నారు.
పెరుగుతున్న AI వాయిస్ స్కామ్‌లు
AI వాయిస్ సింథసిస్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇది వాయిస్‌ని క్లోన్ చేయడానికి స్కామర్‌లను అనుమతిస్తుంది. ఈ సాంకేతికత స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ప్రమాదంగా మారింది. ఎందుకంటే ఇతరుల వాయిస్‌ను అనుకరించడం ద్వారా స్కామర్‌లు ఉపయోగించే సింథసైజ్డ్ వాయిస్‌లతో ఈజీగా మోసం చేయవచ్చు. అటువంటి సాంకేతికతను అడ్డుకోవడానికి ట్రూకాలర్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ ఉపయోగపడనుంది.
For Latest News and Technology News here..